Sunday, December 22, 2024
Homeచిత్ర ప్రభGame Changer: ఆకట్టుకుంటున్న గేమ్ ఛేంజర్ 'దోప్’ సాంగ్‌

Game Changer: ఆకట్టుకుంటున్న గేమ్ ఛేంజర్ ‘దోప్’ సాంగ్‌

Game Changer| గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్(Ram Charan), దిగ్గజ ద‌ర్శ‌కుడు శంక‌ర్(Shankar) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న కొత్త చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుద‌లైన‌ పాటలు, టీజర్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. తాజాగా మరో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘దోప్’(Dhop) అంటూ సాగే ఈ సాంగ్‌ను డల్లాస్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పాటలో చెర్రీ, కియారాల డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా.. థమన్‌, రోషిణి జేకేవీ, పృథ్వీ, శ్రుతి రంజని ఆలపించారు.

- Advertisement -

ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన ‘జ‌ర‌గండి’, ‘రా మ‌చ్చా’, ‘నానా హైరానా’ పాటలు ఆడియన్స్‌ని మెప్పించాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎస్ఎస్ థ‌మ‌న్ బాణీలు అందించిన ఈ మూవీలో అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టించారు. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా 2025 జనవరి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News