Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభGame Changer: 'గేమ్ ఛేంజర్' నుంచి ‘అరుగు మీద' సాంగ్ వచ్చేసింది

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘అరుగు మీద’ సాంగ్ వచ్చేసింది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ‘గేమ్ ఛేంజర్'(Game Changer). ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీకాంత్‌, ఎస్‌జే.సూర్య, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడులైన పాటలు, ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

- Advertisement -

తాజగా ఈ సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. చరణ్, అంజలి జంటగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ‘అలికి పూసిన అరుగు మీద..’ సాంగ్ రానుంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ పాటను వినిపించారు. ఈ పాట అందరికీ తెగ నచ్చేయడంతో మూవీ యూనిట్ ఈ మెలోడీ సాంగ్‌ని యూట్యూబ్‌లో విడుదల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News