Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభGetup Seenu: గెటప్ శీను మరో చలం: మెగాస్టార్ ప్రశంస

Getup Seenu: గెటప్ శీను మరో చలం: మెగాస్టార్ ప్రశంస

బుల్లితెర కమల్ హాసన్‌ శీను

రాజు యాదవ్‌ చిత్రం అందరినీ అలరిస్తుందని, గెటప్ శ్రీను హీరోగా మీ మన్ననలను అందుకుంటాడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.

- Advertisement -

తాజాగా గెటప్ శ్రీను, పద్మవిభూషణ్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ‘రాజు యాదవ్‌’ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని మెగాస్టార్ చిరంజీవి పంచుకున్నారు.

నాకు ఫేవరెట్: చిరు

”గెటప్ శ్రీను.. ఈ పేరు తలచుకోగానే జబర్దస్త్ లో రకరకాల గెటప్పులు, హావభావాలు, గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్వించే నటుడు మన కళ్ళముందు కనబడతాడు. ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడు తను హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ చూశాను. చాలా బావుంది. కొత్తదనం కనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదం పంచుతుంది. శ్రీనుని చూస్తుంటే నాకు గతంలో కామెడీ హీరో చలం గారు గుర్తుకువస్తారు. చలం గారిని ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలానే అనిపిస్తారు. గెటప్ శ్రీను ప్రతిభకు హద్దులు లేవని అనిపిస్తుంటుంది. మే 24న విడుదలయ్యే రాజు యాదవ్ చిత్రం మీ మెప్పు పొందుతుందని, తను హీరోగా మీ మన్ననలని అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకు, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను ఆల్ ది వెరీ బెస్ట్” తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News