Anushka Shetty – Vijay Deverakonda: చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకసారి విడుదల వాయిదా అంటే ఆ సినిమా మీద రక రకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. కొన్ని సినిమాలు అలా వాయిదాల మీద వాయిదాలు పడి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గి ఫ్లాపైనవి కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో బాగా వాయిదా పడుతున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. దీనికి చాలా కారణాలున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం అయి పోస్ట్ పోన్ అయిన సినిమాలు ఉన్నాయి. అంతేకాదు, హీరోహీరోయిన్స్ డేట్స్ కుదరక కూడా సినిమాలు సకాలంలో షూటింగ్ జరగక పోస్ట్ పోన్ అయ్యాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా కూడా గత ఏడాది నుంచి పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. గత నెలలోనే రిలీజ్ అని కూడా మేకర్స్ చెప్పారు. కానీ, మళ్ళీ పోస్ట్ పోన్ అయి ఈ నెల 24న వస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ కూడా ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ, వాయిదా పడుతు వచ్చి ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అని మేకర్స్ ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఇంకా అఫీషియల్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు.
ఇదే క్రమంలో అనుష్క శెట్టి నటిస్తున్న క్రేజీ మూవీ ఘాటి కూడా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడి జూలై 11న రిలీజ్ అని చెప్పారు. కానీ, తాజా పరిణామాలు చూస్తే ఘాటీ సౌండ్ అసలు వినిపించడం లేదు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతోంది. వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో మళ్ళీ వాయిదా పడింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ram-charan-latest-pan-india-movie-peddi-latest-update/
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా కింగ్‌డమ్ కూడా జూలై 25న రిలీజ్ అని ప్రచారం జరిగింది. ఒక సందర్భంలో హరి హర వీరమల్లు తో పోటీ అని భావించారు. కానీ, ఈ మూవీ విషయంలో కూడా ప్రస్తుతం ఉన్న పరిణామాలను చూస్తుంటే అనుకున్న తేదీకి రిలీజ్ అవడం కష్టం అని అంటున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ చేనున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా కింగ్‌డమ్ సినిమా తెరకెక్కుతోంది. ఘాటి అలాగే, కింగ్‌డమ్ సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అయింది. మరి కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.