Homeచిత్ర ప్రభSrinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ మూవీ.. శ్రీనివాస మంగాపురం టీజర్‌ చూశారా?

Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ మూవీ.. శ్రీనివాస మంగాపురం టీజర్‌ చూశారా?

Srinivasa Mangapuram Teaser:ఘట్టమనేని వారసుడిగా జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. దివంగత నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌ బాబు కుమారుడే జయకృష్ణ. డైరెక్టర్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ టాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంతోనే బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కూతురు రషా తడాని తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం ఇస్తుండటం విశేషం. ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ని ప్రకటించారు.

- Advertisement -

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీని టీజర్‌ తాజాగా విడుదల చేశారు. ఇవాళ విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు లుక్ చూస్తుంటే విలన్‌గా అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీని తిరుపతి నేపథ్యంలో రూపొందించారు. టీజర్‌లో డైలాగ్స్, ఫైట్ సీన్స్‌ రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో కథ ఉండనున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News