Tuesday, February 11, 2025
Homeచిత్ర ప్రభSankranthiki Vasthunam: ‘గోదారిగట్టు మీద రామచిలకవే’.. ఫుల్‌ వీడియో వచ్చేసింది

Sankranthiki Vasthunam: ‘గోదారిగట్టు మీద రామచిలకవే’.. ఫుల్‌ వీడియో వచ్చేసింది

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో మూవీకి వసూళ్ల వర్షం కురిసిందిత. ఈ క్రమంలో 15 రోజుల్లోనే రూ.300కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించింది.

- Advertisement -

ఇక ఈ మూవీలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్‌లు హీరోయిన్లగా న‌టించగా.. వీవీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా.. భీమ్స్ సంగీతం అందించారు.

ఈ సినిమాలో వెంకటేశ్‌, ఐశ్వర్యపై చిత్రీకరించిన ‘గోదారి గట్టు మీద రామచిలకవే’(Godari Gattu Video Song) అంటూ సాగే పాట సూపర్‌హిట్‌ అయిన విషయం విధితమే. ప్రముఖ గాయకుడు రమణ గోగుల, మధుప్రియ పాడిన ఈ పాట ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News