ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘గోల్డ్ స్పాట్’. అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయకృష్ణ లింగమనేని సమర్పణలో రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్నారు. వేణు కార్తికేయన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో దర్శకుడిగా సుపరిచితమైన దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే…హీరోయిన్ తన ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడు రామ్ గురించి చెబుతూ ఆసక్తికరంగా మొదలువుతుంది. ‘అమ్మను చిన్నప్పుడే తీసుకువెళ్లిపోయిన ఆ దేవుడే, నాకు రామ్ ను పరిచయం చేశాడంటూ.. హీరోయిన్ చెప్పడం ఆమె అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలియజేస్తోంది. ‘మనకు జీవితంలో ఎంతోమంది పరిచయమవుతుంటారు. కానీ ఒక్కరే జీవితంగా మారిపోతారు..’ అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. ఎమోషనల్ డెప్త్ ఉన్న ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో చూడబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి డీవోపీ: మహీరెడ్డి, మ్యూజిక్: నరేన్ రెడ్డి, స్టంట్స్: ఎం.హరికృష్ణ, ఎడిటర్: నరేష్ అడుపా, ప్రొడక్షన్ డిజైనర్: పవన్ కల్యాణ్ యల్లపు.
Gold Spot: భావోద్వేగ ప్రేమకథతో ‘గోల్డ్ స్పాట్’
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

