HomeTop StoriesPeddi ticket rates: పెద్దికి భారీ ఊరట.. తెలంగాణలో టికెట్‌ రేట్ల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌

Peddi ticket rates: పెద్దికి భారీ ఊరట.. తెలంగాణలో టికెట్‌ రేట్ల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌

Green signal to increase Peddi ticket rates: గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం రేపు (జూన్ 4న) వివిధ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజు రాత్రే ప్రీమియర్‌ షో ప్రదర్శితం కానున్నాయి. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ ఫుల్ రోల్‌లో రామ్‌చరణ్‌ కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే, ఏపీలో పెద్ది సినిమా రేట్లు పెంచగా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల పెంపునకు అనుమతించింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం అమల్లో ఉన్న టికెట్ ధరపై అదనంగా రూ. 100, మల్టీప్లెక్స్ థియేటర్లలో అదనంగా ప్రతి టికెట్‌పై రూ. 125 పెంచుకోవచ్చునని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, ఇవాళ (జూన్ 3) రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ. 600 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

- Advertisement -

Also read: CM Chandrbabu: అనవసరంగా రెచ్చగొడుతున్నారు.. పవన్‌కు మద్దతుగా చంద్రబాబు.. సంచలన కామెంట్స్‌

కృతజ్ఞతలు చెబుతూ రామ్‌ చరణ్‌ ట్వీట్‌..

ఇక, టికెట్ ధరల పెంపు సినిమా విడుదలైన రోజు నుంచి గరిష్టంగా 10 రోజుల వరకు అమల్లో ఉంటుందని జీవోలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రెట్లు పెంపునకు అనుమతివ్వడంతో ‘పెద్ది’ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ‘తెలుగు సినిమా శ్రేయస్సు కోసం మద్దతిచ్చి, అండగా నిలుస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.” అని ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News