ఈరోజు ఎపిసోడ్‌లో బాలు ఆవేశంతో మౌనిక దగ్గరకు వెళ్లాలని బయలుదేరుతుంటే అడ్డంగా లక్షలు మింగినోడు అడ్డుపడతాడు. వాడిని పక్కకి తోసి వెళ్తుంటే అప్పుడు ప్రభావతి గొడవ పడుతుంది. అప్పుడు సత్యం ఏ తండ్రి కూతురు బాధపడాలని కోరుకోడు. తను అక్కడ సంతోషంగానే ఉందని నాకు అనిపిస్తుంది. ఏదైనా కష్టం వస్తే తనే చెప్తుంది. ఎవరూ ఏమి చెప్పలేదు కదా తనకి అంతా మంచే జరుగుతుంది నువ్వు ధైర్యంగా ఉండు అని నచ్చ చెప్తాడు. నీ మీద కోపం ఉన్నా మా మీద గౌరవంతో ఏమి అనకుండా మౌనికను వాళ్ల ఇంటి కోడలిని చేసుకున్నారు నువ్వు వెళ్లి మొత్తం పెంట చేసి గొడవలు పెట్టి రా అని ప్రభావతి బాలుని తిడుతుంది. నీ చెల్లి జీవితం నువ్వే నాశనం చేయి అంటుంది. ఇంక చేసేది ఏమి లేక నాన్నకి మాట ఇచ్చి గదిలోకి సీరియస్‌గా వెళ్తాడు.
అప్పుడు మీనా ఇప్పుడు ఏమి జరగలేదు కదా ఎందుకు ఆవేశపడతారు అంటుంది మీనా. అయితే అన్ని తెలిసి కుడా చూస్తూ ఉండాలా అంటాడు బాలు. మీరు ఇక్కడ ఏమి చెప్పినా వినే వాళ్లు లేరు. వాళ్లు అందరూ ఎలా ఆలోచిస్తే అలా నలుగురితో నారాయణ అనుకోవాలి అంటుంది. అప్పుడు బాలు అయితే అక్కడ నా చెల్లెలు ఏడుస్తుంటే మా బావ ఏంత మంచోడో అనుకోవాలా అంటాడు బాలు. లేదు ఇక్కడ మన మాట చెల్లనప్పుడు కొద్ది రోజులు ఆగాలి అప్పుడే పరిష్కారం దొరుకుతుంది అంటుంది. ఇంట్లో అందరూ ఆ సంజు మాయలో ఉన్నారు. పైగా మౌనికకు ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకుంది. పెళ్లికి ముందే అతనితో అన్ని మాట్లాడింది. ఏదైనా సమస్య వస్తే తను మనతో చెప్పుకుంటుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అత్తయ్యతో సహా అందరూ మీ గురించి తెలుసుకుంటారు. మనం చెప్పే కంటే వాళ్లే తెలుసుకుంటే మంచిది అంటుంది మీనా.
బాలు తన చెల్లి కోసం కొన్న గాజులను చూపిస్తూ ఏదొక రోజు అన్ని సర్ధుకుని ఈ గాజులు మీ చెల్లి చేతికి వేసే రటైం వస్తుంది అంటుంది. ఆ తర్వాత టిఫిన్ బాలుకి టిఫిన్ పెడుతుంటే మాకు ఉందా అంతా వాడికేనా అంటుంది ప్రభావతి. అయ్యగారికి ఆవేశం తగ్గిందా అని అడుగుతుంది. మాటల్లో మాటకి ప్రభావతి రవిని ఇంటికి తీసుకురమ్మని అంటుంది. ఇంట్లో నువ్వు ఒక్కడివే పడి తిందామనుకుంటున్నావా వాడిని రానివ్వవా అని అడుగుతుంది. వాడివల్లే నా చెల్లికి అన్యాయంగా పెళ్లి జరిగింది అంటాడు బాలు. శృతి వాళ్ల ఇంట్లో వాళ్లు తీసుకొచ్చి దింపుతేనే ఇంట్లోకి రానిస్తాను అంటాడు బాలు వాళ్ల నాన్న. మంచిగా గుడికి వెళ్తున్న వాళ్లని ఆపి మరి తిట్టించుకుంటారు అందరూ. నన్ను మౌనిక దగ్గరికి వెళ్లద్దన్నారు కాబట్టి మీరు సృతి వాళ్ల దగ్గరికి వెళ్లడానికి వీలు లేదు అని బాలు అంటాడు. అక్కడ శృతి వాళ్ల అమ్మానాన్న సత్యాన్ని గుర్తుచేసుకుని తాగుతూ కూర్చుంటారు. ఎలా అయినా వాళ్ల మీద పగ తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.