Haniska: హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ భామ దేశముదురు చిత్రంతో హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తనదైన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ మనసు దోచేసింది. ముఖ్యంగా సినిమాలోని ఆమె క్యూట్ లుక్స్, అమాయకపు మాటలకు కుర్రకారును ఫిదా అయ్యింది. తొలి చిత్రంతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
భర్తతో విడాకులు
ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది ముద్దుగుమ్మ. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే సడెన్ ఈ భామ తెలుగు తెరకు దూరమైంది. కాస్తా బొద్దుగా తయారవడంతో హన్సిక సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ లేడీ ఒరియంటెడ్ పాత్రలు, కీ రోల్స్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ ఆఫర్స్ తగ్గిపోవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొంతకాలం తర్వాత సడెన్‌గా తన బాయ్‌ఫ్రెండ్ పరిచం చేసింది. సోహైల్ కతూరియాతో తన ఎంగేజ్‌మెంట్ జరిగిందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నానంటూ 2022లో ప్రకటించింది.
ఆ వెంటనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కానీ, ఆ పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా అయ్యింది. పెళ్లయిన నాలుగేళ్లకే హన్సిక విడాకులు తీసుకున్న సంగతి ప్రస్తుతం సింగిల్‌గా జీవిస్తోంది. అయితే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో హన్సిక మాట్లాడుతూ తన సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తొలి తెలుగు డెబ్యూ చిత్రం దేశముదురు చిత్ర విశేషాలను కూడా పంచుకుంది. ముఖ్యంగా తన తొలి మూవీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయం చెప్పింది.
ఆయన చాలా స్పెషల్
“అల్లు అర్జున్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఎవరితోనైనా చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. స్నేహపూర్వకంగా ఉండడం అతనిలోని సహజ గుణం. దేశముదురు మూవీ టైంలో ఆయనతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. ఆయనతోనే కాదు మూవీ టీం మొత్తానికి నేను చాలా కనెక్ట్ అయిపోయాను. అందరితో చాలా సరదగా ఉండేదాన్ని. దీంతో సినిమా షూటింగ్ అయిపోవడంతో ఇక వారిని కలిసే ఛాన్స్ ఉండదని చాలా బాధేసింది. షూటింగ్ చివరి రోజు అందరికి సెండాఫ్ ఇస్తుంటే నా మనసు బరువెక్కింది. దీంతో సెట్‌లో ఏడ్చాను. ఆ సందర్భం నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఏ మూవీ సెట్‌లోనూ తాను ఏడ్వలేదు’ అని చెప్పుకొచ్చింది.
Also Read: Hansika: పశ్చాతాపం లేదు.. విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక

