Homeచిత్ర ప్రభHansika Motwani: ఆఫిషియల్‌.. భర్తతో విడిపోయిన హన్సిక, విడాకులు మంజూరు

Hansika Motwani: ఆఫిషియల్‌.. భర్తతో విడిపోయిన హన్సిక, విడాకులు మంజూరు

Hansika Motwani: రూమర్సే నిజమయ్యాయి. హన్సిక మోత్వాని తన వైవాహిక జీవితానికి స్వస్తీ పలికింది. పెళ్లయిన నాలుగేళ్లకే భర్తతో విడిపోయింది. తాజాగా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్టు బి-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశ ముదురు చిత్రంలో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అతి తక్కవ టైంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తనదైన నటన, అందం, అభినయంతో ఆడియన్స్‌ మనసు దొచేసింది.

- Advertisement -

విడాకులు రూమర్స్
ఎంతోమంది స్టార్‌ హీరోల సరసన నటించని హన్సిక ప్రస్తుతం తెలుగులో కనిపించి చాలా కాలం అవుతుంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె నాలుగేళ్ల క్రితం తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సినిమాలకు పూర్తిగా దూరమైన హన్సిక ఈ మధ్య తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తోంది. హన్సిక తన భర్తకు దూరంగా ఉంటుందని, ఇద్దరు వేరు వేరుగా నివసిస్తున్నట్టు సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఇక తన సోషల్ మీడియాలో పోస్ట్స్‌ సైతం ఈ వార్తలు మరింత బలం చేకూర్చాయి. ఎప్పుడు భర్తతో జంటగా, ఫ్యామిలీతో ఫోటోలు షేర్‌ చేసే హన్సిక కొంతకాలంగా సింగిల్ ఫోటోలు, స్టేటస్‌లు పెడుతోంది.

2022లో పెళ్లి
దీంతో ఆమె విడాకుల వార్తల నిజమేనా అని అంత అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తాజాగా హన్సికకు ఆమె భర్త సోహైల్ కతూరియాతో ఆఫిషియల్‌ విడిపోయారట. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. ఇరువురూ పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు సమాచారం. హన్సిక తన భర్త నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదని తెలుస్తోంది. కాగా పెళ్లయిన ఏడాది నుంచే హన్సిక-సోహైల్‌ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని.. అవి కాస్తా విడాకుల వరకు దారితీశాయని తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదట.

Also Read: Jayam Ravi: మాజీ భార్యపై జయం రవి సంచలన వ్యాఖ్యలు.. హీరోకి ఆర్తి సోదరి కౌంటర్‌

విడాకులు మంజూరు
దీంతో నేడు బుధవారం (మార్చి 11) పరస్పర అంగీకారంతో బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. కాగా తన స్నేహితురాలి భర్త అయిన సోహైల్‌ కతురియాను హన్సికల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లిన హన్సికకు.. అప్పుడే సోహైల్‌తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. హన్సిక మీద ఇష్టంతో సోహైల్‌ భార్యకు విడాకులు ఇచ్చినట్టు టాక్‌. ఆ తర్వాత వీరిద్దరు కొంతకాలం డేటింగ్‌ అనంతరం 2022లో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లయిన నాలుగేళ్లకు విడాకులు తీసుకుని విడిపోవడం వారి ఫ్యాన్స్‌ బాధిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News