Pawan Kalyan Hari Hara Veera Mallu Trailer: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు మూవీకి మొన్నటివరకు ఎలాంటి బజ్ లేదు. అసలు సినిమా రిలీజ్ కావడమే గొప్ప అని చెప్పుకునే పరిస్థితి ఎదురవుతూ వచ్చింది. కానీ ట్రైలర్‌తో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. గురువారం రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్‌లో పవన్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై చాలా రోజులుగా వస్తోన్న విమర్శలకు చాలా వరకు చెక్ పెట్టారు మేకర్స్. హరిహర వీరమల్లు ప్రమోషన్స్‌కు సంబంధించి ది బెస్ట్ అని ఫ్యాన్స్ అనుకునేలా ఈ ట్రైలర్ కట్ చేశారు.
47 మిలియన్ల వ్యూస్…
హరిహర వీరమల్లు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో 47 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. 719 కే లైక్స్ వచ్చాయి. 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన తెలుగు మూవీ ట్రైలర్‌గా హరిహర వీరమల్లు సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రికార్డ్‌ను బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో పవన్ మూవీ నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప 2 తెలుగు ట్రైలర్ 24 గంటల్లో 44 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది.
గుంటూరు కారం…
ట్రైలర్ రికార్డ్స్‌లో పుష్ప 2 తర్వాత మహేష్‌బాబు గుంటూరు కారం (37 మిలియన్లు), రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (36 మిలియన్లు)తో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. హరిహర వీరమల్లు మూవీకి ఏఎమ్ జ్యోతికృష్ణతో పాటు క్రిష్ దర్శకత్వం వహించారు. క్రిష్ డైరెక్షన్‌లో ఈ మూవీ మొదలైంది. షూటింగ్ ఆలస్యం కావడం, మేకర్స్‌తో నెలకొన్న విభేదాల కారణంగా హరిహర వీరమల్లు పూర్తికాకుండానే క్రిష్ తప్పుకున్నాడు.
బాలీవుడ్ హీరోయిన్లు…
హరిహరవీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సత్యరాజ్, తనికెళ్లభరణి, విక్రమ్ జీత్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. అనసూయ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది.