Homeచిత్ర ప్రభKaaka: హార్ట్ ఆఫ్ 'కాకా' అమ్ములు పాపగా అనస్వర .. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌ లుక్‌

Kaaka: హార్ట్ ఆఫ్ ‘కాకా’ అమ్ములు పాపగా అనస్వర .. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌ లుక్‌

Kaaka Movie Update: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’తో రాబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నఈ సినిమాను హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మెగాస్టార్ ను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో చూపించడంతో సినిమాపై మాస్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నాడు మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 

- Advertisement -

చేతుల్లో పుస్తకాలు, వైట్ కోట్, స్టెతస్కోప్, భుజంపై బ్యాక్‌ప్యాక్‌తో సింపుల్‌, అమాయకంగా కనిపించే అమ్మాయిగా అనస్వరను ప్రజెంట్ చేశారు. ఆమె సింపుల్ లుక్ పోస్టర్‌కు ఎంతో సహజమైన ఫీల్‌ను తీసుకురావడంతో పాటు, ఆమె మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రకు తగ్గట్టుగా ఉంది. ఆమె వెనుక పడిన నీడ పోస్టర్ మూడ్‌ను పూర్తిగా మార్చేస్తోంది. గోడపై మెగాస్టార్ చిరంజీవి సిల్హౌట్ కనిపిస్తూ, అనస్వర సాఫ్ట్, చీర్‌ఫుల్ అప్పియరెన్స్‌కు ఆసక్తికరమైన కాంట్రాస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. అనస్వరను రక్షించడానికి చిరంజీవి ‘సత్యం’ పాత్ర అక్కడ ఉందని హింట్ ఇంస్తోంది. ఈ కంపోజిషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అనస్వరను మేకర్స్ “హార్ట్ ఆఫ్ కాకా”గా ఆమె పాత్రను “అమ్ములు పాప”గా రివీల్ చేశారు. 

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. 2027 జనవరి 13న సంక్రాంతి పండగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఎస్. తమన్ సంగీతాన్ని, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా…అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లేని సమకూరుస్తుండగా… హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్‌గా పనిచేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News