Tuesday, September 10, 2024
Homeచిత్ర ప్రభHero Adivi Sesh surprise to cancer patient: క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి సర్ప్రైజ్...

Hero Adivi Sesh surprise to cancer patient: క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి సర్ప్రైజ్ ఇచ్చిన హీరో అడివి శేష్

తన లిటిల్ ఫ్యాన్ తో డే అంతా ..

హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు.

- Advertisement -

ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. చిన్నారి కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.

ఒక హోటల్‌లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలసి సర్ప్రైజ్ చేశారు. పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు.

చిన్నిపాప, ఆమె కుటుంబ సభ్యులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటున్న శేష్, అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకున్నారు.

శేష్‌కి డై -హార్డ్ ఫ్యాన్ అయిన ఆ చిన్నారి తన అభిమాన హీరోని కలవాలని చాలా కాలంగా కలలుకంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న శేష్, ఆమె కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. స్క్రీన్ మీదే కాదు, అఫ్ స్క్రీన్ లోనూ లార్జర్ దెన్ లైఫ్ హీరోగా తన గొప్ప మనసుని చాటారు శేష్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News