Homeచిత్ర ప్రభSardar- 2: గొప్ప స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం- ప్రి- రిలీజ్ ఈవెంట్‌లో హీరో...

Sardar- 2: గొప్ప స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం- ప్రి- రిలీజ్ ఈవెంట్‌లో హీరో కార్తీ

Sardar- 2 Hero Karthi: ‘సర్దార్ 2’ తన కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ సినిమా అని హీరో కార్తీ అన్నారు. తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ చిత్రం తెరకెక్కింది.  పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

- Advertisement -

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో కార్తి మాట్లాడుతూ, “సర్దార్ సినిమాకు ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. నిజానికి గూఢచారులకు ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ వాళ్ల పని వాళ్లు చాలా నిజాయితీతో,  ఏదీ ఆశించకుండా చేస్తారు. ‘సర్దార్ 2’ చూసే ముందు ‘సర్దార్’ సినిమా మరొకసారి చూడమని కోరుతున్నాను. అది యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. అలా ఆ సినిమా చూస్తే మీరు ‘సర్దార్ 2’కి  ఇంకా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇంత స్టైలిష్‌గా యాక్షన్ సినిమాలు చేయడం మనకు కుదరదా అని అనిపించేది. అది ఈ సినిమాతో తీరింది. యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది” అని అన్నారు. 

ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ, “తెలుగు  సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తోంది. పరిశ్రమ కళకళలాడుతోంది. ఇలాంటి సమయంలో వస్తున్న‘సర్దార్ 2’ అద్భుతమైన సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొనగా…మరో అతిథిగా పాల్గొన్న హీరో అడివి శేష్ మాట్లాడుతూ, “నా ఫేవరెట్ సినిమాల్లో కార్తీవే ఎక్కువ. ఆవారా, ఖైదీ, ‘సత్యం సుందరం’ ఈ సినిమాలన్నీ ఇష్టం. అలాగే నాకు ‘సర్దార్’ సినిమా కూడా చాలా ఇష్టం” అని అన్నారు. ఇంకా ఈ వేడుకలో 

ఎస్.జె. సూర్య, హీరోయిన్ మాళవిక మోహనన్, ఆశిక రంగనాథ్, నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ, అనిల్ సుంకర, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News