Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభ3 BHK: తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ‌ను ఎప్పటికీ మ‌ర‌చిపోలేను: హీరో సిద్ధార్థ్‌

3 BHK: తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ‌ను ఎప్పటికీ మ‌ర‌చిపోలేను: హీరో సిద్ధార్థ్‌

Siddharth: హీరో సిద్ధార్థ్ నటించిన 40వ చిత్రం‘3 BHK’. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర త‌దిత‌రులు ఇత‌ర పాత్రల్లో న‌టించారు. థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబీకులు సొంత ఇంటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌నుకుంటుంటారు. అలాంటి ఓ కుటుంబానికి సంబంధించిన క‌థే ఇది.

- Advertisement -

జీవితంలో నిరాశ‌, వైఫ‌ల్యాల‌ను ఎదుర్కొన్న ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి త‌న కుటుంబ ఆకాంక్ష‌ల‌ను కొడుకుపై ఉంచుతాడు. అయితే ఎన్నోప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ 34 సంవ‌త్స‌రాలకు కూడా కొడుక్కి ఉద్యోగం రాదు. ఆ కొడుకు భావోద్వేగ ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. జూలై 4న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన సిద్ధార్థ్ ఈ క్యారెక్ట‌ర్‌లోనూ ఒదిగిపోయారు. ట్రైల‌ర్ చూస్తుంటే సిద్ధార్థ్ త‌న పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్నార‌ని తెలుస్తోంది. ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి పాత్రలో శ‌ర‌త్ కుమార్ న‌టించారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vishnu-manchu-clarity-on-kannappa-ott-release/

ఈ సంద‌ర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘‘‘3 BHK’ సినిమా ఒక నిజ ఘటన నుంచి వచ్చిన కథ. మూవీ చూసిన తర్వాత వెంటనే మా నాన్నని గట్టిగా హత్తుకోవాలనిపించింది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని బొమ్మ‌రిల్లులో చూశారు. న‌టుడిగా ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ తండ్రి కొడుకుల బంధాన్ని ‘3 BHK’లో చూస్తారు. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. కుటుంబంతో క‌లిసి చూసే సినిమా. ఇది నా 40వ సినిమా. తెలుగు ప్రేక్ష‌కులు చూపే ప్రేమ‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఇదొక చ‌క్క‌టి ఫ్యామిలీ స్టోరి. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అలాగే ‘3 BHK’ సినిమాని కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి అంకితం చేస్తున్నాం. జూలై 4న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

డైరెక్టర్ శ్రీ గణేష్ స్పందిస్తూ ‘‘‘3 BHK’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ముందు తీసుకురావడం నాకు ఒక బిగ్ అచీవ్‌మెంట్. ‘బొమ్మరిల్లు’ సినిమాలాగానే ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. చాలా ప్రేమతో ఈ సినిమా తీశాం. సినిమాను సక్సెస్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శరత్ కుమార్, దేవయాని, మైత్రీ మూవీస్ శశి, నిర్మాత అరుణ్ విశ్వ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News