Thursday, March 12, 2026
Homeచిత్ర ప్రభNewtons Third Law: వెరైటీ టైటిల్‌తో అక్కినేని హీరో థ్రిల్ల‌ర్ మూవీ - రిలీజ్‌పై ట్విస్ట్‌

Newtons Third Law: వెరైటీ టైటిల్‌తో అక్కినేని హీరో థ్రిల్ల‌ర్ మూవీ – రిలీజ్‌పై ట్విస్ట్‌

Newtons Third Law: రిజ‌ల్ట్‌, ఇమేజ్‌ల‌తో సంబంధం లేకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌. అత‌డి గ‌త సినిమా అన‌గ‌న‌గా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. అన‌గ‌న‌గా మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. తాజాగా ఇదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో త‌న నెక్స్ట్ సినిమాను చేశాడు సుమంత్‌. అయితే ఈ సినిమా నేరుగా ఓటీటీలో కాకుండా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంద‌ట‌.

- Advertisement -

ఈ సినిమా టైటిల్‌తో పాటు జాన‌ర్ ఏమిట‌న్న‌ది ఈటీవీ విన్ సంస్థ ఆదివారం రివీల్ చేసింది. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు న్యూట‌న్స్ థ‌ర్డ్ లా అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. 1996లో జ‌రిగిన ఓ డ్యూయ‌ల్ మ‌ర్డ‌ర్స్ కేసు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు ఓ వీడియో ద్వారా మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ చూడ‌ని యూనిక్ కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న థ్రిల్ల‌ర్ మూవీ ఇద‌ని సుమంత్ పేర్కొన్నారు.

Also Read – Naveen Polishetty : ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సీక్వెల్‌పై చ‌ర్చ‌!

ఈటీవీ విన్ ఈ సినిమాను నిర్మించిన ఓటీటీలో కాకుండా థియేట‌ర్ల‌లో ఈ సినిమాను విడుద‌ల‌ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఫిబ్ర‌వ‌రి 9 ఈ సినిమాలో సుమంత్ క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది ఓ వీడియో గ్లింప్స్ రివీల్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో సుమంత్‌తో పాటు శ్రీనివాస్ అవ‌స‌రాల‌, ర‌వివ‌ర్మ‌, నేహా ప‌ఠాన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాకు రాజేష్ క‌ర్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మార్చిలో ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం న్యూట‌న్స్ థ‌ర్డ్ లాతో పాటు మ‌హేంద్ర‌గిరి వారాహి పేరుతో మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ కూడా చేస్తున్నాడు సుమంత్‌. ఈ సినిమాకు సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం.

Also Read – Yellamma: ఎల్ల‌మ్మ‌కు మ‌రో అడ్డంకి – షూటింగ్ ఇప్ప‌ట్లో లేద‌ట‌ – కార‌ణం ఇదే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News