Homeచిత్ర ప్రభSumanth: ‘మహేంద్రగిరి వారాహి’లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే క్యారెక్టర్‌.. హీరో సుమంత్ 

Sumanth: ‘మహేంద్రగిరి వారాహి’లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే క్యారెక్టర్‌.. హీరో సుమంత్ 

“మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం తెరకెక్కింది. చాలా బిగ్ స్కేల్ లో చేశాం.ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది” అని ఆ చిత్ర హీరో సుమంత్ పేర్కొన్నారు. సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో…స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రమిది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు.  “ఈ మధ్యకాలంలో నా నుంచి వస్తున్న చాలా బిగ్ బడ్జెట్ సినిమా ఇది. నిర్మాతలు చాలా పెద్ద స్కేల్ లో తీశారు. హిందీ, తమిళ్‌లో కూడా రిలీజ్ అవుతుంది. నార్త్ నుంచి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కథ మొత్తం నాకు నచ్చింది. ఇంటర్వెల్ లో, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి హై ఇస్తాయి. సంతోష్ ఈ కథని సింగిల్ సిట్టింగ్‌లో చెప్పారు.

- Advertisement -

ఆ పాయింట్ గుర్తు చేసినప్పటికీ ఇది డిఫరెంట్ సబ్జెక్టు..

నేను యూట్యూబ్ లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇది డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. అలాగే మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రం ట్రైలర్‌లో చూపించినట్టుగా 33 ఏళ్లు దాటితే ఆ వంశంలో వ్యక్తులు చనిపోతున్నారు అనేది ‘మురారి’ సినిమా పాయింట్‌ని గుర్తు చేసినప్పటికీ, ఇందులో కథ, స్క్రీన్‌ప్లే చాలా భిన్నంగా ఉంటాయి. కథ అనుకున్నప్పుడే మేము ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేశాం. పవన్ కళ్యాణ్ కి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది. కాబట్టి మా సినిమాకి కూడా అది కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం. హీరోతో పాటు విలన్, బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్ లు చేసేందుకు సిద్ధం. ఇందులో ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అలాగే యాక్షన్ బ్లాక్స్ చాలా ఉంటాయి. యాక్షన్ చేయడం నాకు ఇష్టం. గతంలో కూడా చాలా యాక్షన్ సినిమాలు చేశాను. మంచి యాక్షన్ కథ వస్తే ఖచ్చితంగా చేస్తాను. నేను ఎప్పటినుంచో విలన్ పాత్రలకు సిద్ధంగా ఉన్నాను. హీరో పాత్రలు చేయడంతో పాటు మంచి విలన్ క్యారెక్టర్లు, అలాగే బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News