Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభVarun Tej | కొండగట్టు అంజన్న సన్నిధిలో వరుణ్ తేజ్

Varun Tej | కొండగట్టు అంజన్న సన్నిధిలో వరుణ్ తేజ్

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Hero Varun Tej) హనుమాన్ మాలాధారణలో మంగళవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి దర్శనంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకి ప్రసాదాలు, ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు. అంతకంటే ముందు వరుణ్ తేజ్ కి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ (Varun Tej) మాట్లాడుతూ… అత్యంత శక్తిమంతుడైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

కాగా, మెగా ఫ్యామిలీ ఆంజనేయస్వామి భక్తులని అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికలకి ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. తన వారాహి యాత్రకి ముందు వాహనాన్ని అక్కడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, ముడుపులు కట్టారు. ఎన్నికల్లో ఘన విజయం అనంతరం మరోసారి కొండగట్టు అంజన్నని సందర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad