Thursday, January 22, 2026
Homeచిత్ర ప్రభHero Vijay: 'లియో: బ్లడీ స్వీట్' అంటున్న విజయ్

Hero Vijay: ‘లియో: బ్లడీ స్వీట్’ అంటున్న విజయ్

దళపతి విజయ్ సినిమా వస్తుందంటేనే తమిళ తంబీలకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో యాక్షన్ హీరో విజయ్ అంటే ఇక ఆ కాంబో ఎంత క్రేజీగా ఉంటుందో కదా. తమిళం మాత్రమే కాదు ఇప్పుడు డైరెక్టర్ లోకేష్ కు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ భీభత్సంగా తయారయ్యారు. విక్రం సినిమా హిట్ తో ఒక్కసారిగా యాక్టర్స్ అంతా లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో యాక్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. త్రిష-విజయ్ కాంబినేషన్ లో వస్తున్న దళపతి 67 సినిమాకు ఇప్పుడు లియో-బ్లడీ బాత్ అనే పేరు ఖరారు చేశారు. ఈనేపథ్యంలో రిలీజ్ అయిన టీజర్ అదరగొట్టింది. ఇక ఈ సినిమాకు అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ కూడా కేక అనేలా ఉందనిపించేలా ఉంది టీజర్. సంజయ్ దత్ విలన్ గా ఉన్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News