Sunday, September 8, 2024
Homeచిత్ర ప్రభVishal: విజయ్‌ సినిమాలో ఆఫర్ వదులుకున్న విశాల్.. ఏమన్నాడో తెలుసా?

Vishal: విజయ్‌ సినిమాలో ఆఫర్ వదులుకున్న విశాల్.. ఏమన్నాడో తెలుసా?

- Advertisement -

Vishal : తమిళ్ స్టార్ హీరో విజయ్ త్వరలో సంక్రాంతికి ‘వారసుడు’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా షూట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక విజయ్ అప్పుడే తన 67వ సినిమా షూట్ లో కూడా జాయిన్ అయిపోయాడు. విజయ్ కి మాస్టర్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 67వ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతుంది.

అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రకి హీరో విశాల్ ని అడిగాడట డైరెక్టర్ లోకేష్. కానీ విశాల్ నో చెప్పాడట. దీనిపై విశాల్ స్పందించాడు. త్వరలో విశాల్ లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడాడు.

విశాల్ మాట్లాడుతూ.. ”డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వచ్చి నాకు కథ చెప్పి విజయ్ సినిమాలో పాత్ర చేయమని అడిగాడు. నాకు కథ కూడా నచ్చింది. అయితే లోకేష్ ఆ పాత్రకి చాలా ఎక్కువ డేట్స్ అడిగాడు షూటింగ్ కి. ప్రస్తుతం నేను రెండు ప్రాజెక్ట్స్, లాఠీ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాను. నా కోసం వాళ్ళు షూటింగ్ ఆపుకోరు, నేను ముందే ఇచ్చిన డేట్స్ ని క్యాన్సిల్ చేసుకోలేను అందుకే డేట్స్ అడ్జస్ట్ అవ్వక ఆ సినిమా చెయ్యట్లేదు. కానీ విజయ్ ని హీరోగా పెట్టి త్వరలో నేనే డైరెక్టర్ గా ఒక సినిమా చేస్తాను అని చెప్పాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

విశాల్ విజయ్ సినిమాకి నో చెప్పాడని విజయ్ ఫ్యాన్స్ కొంచెం ట్రోల్ చేసినా తన డైరెక్షన్ లో విజయ్ తో సినిమా తీస్తాను అనడంతో కూల్ అయ్యారు. మరి ఈ స్పెషల్ కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News