Tharun Bhascker And Eesha Rebba: గతంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లయితే హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లేననే అపోహ ఉండేది. పెళ్లిచేసుకున్న హీరోయిన్లకు అవకాశాలు వచ్చేవి కాదు. ఒకవేళ ఆఫర్లు వచ్చినా హీరోయిన్‌గా కాకుండా సైడ్ రోల్స్‌కు పరిమితమైపోవాల్సివచ్చేది. ప్రస్తుతం ఈ ట్రెండ్ మారిపోయింది. పెళ్లి చేసుకొని కూడా స్టార్ హీరోయిన్లు సినిమాలు చేస్తున్నారు. వివాహం కెరీర్‌కు ఏ మాత్రం అడ్డు కాదని నిరూపిస్తున్నారు. కీర్తి సురేష్, అలియాభట్, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనేతో పాటు చాలా కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ సమంత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లిచేసుకుంది. తాజాగా సమంత బాటలోనే మరో టాలీవుడ్ హీరోయిన్ అడుగులు వేయబోతుంది. తనతో సినిమా చేసిన డైరెక్టర్‌నే పెళ్లిచేసుకోబోతుంది.
అచ్చ తెలుగు హీరోయిన్ ఈషారెబ్బా.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ప్రస్తుతం తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా హీరోహీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఫన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా భార్యభర్తలుగా నటిస్తున్నారు. ఈ రీల్ లైఫ్ బంధాన్ని రియల్‌గా మార్చబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది తమ పెళ్లి కబురు వినిపించబోతున్నట్లు సమాచారం.
ఓం శాంతి శాంతి శాంతిః సినిమా చిత్రీకరణలోనే తరుణ్ భాస్కర్, ఈషారెబ్బాకు మధ్య ప్రేమ చిగురించినట్లు, వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు టాలీవుడ్‌లో కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల హీరో విశ్వక్‌సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు తరుణ్, ఈషా జంటగా అటెండ్ అయ్యారు. కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చాలా క్లోజ్‌గా కనిపించడం ఈ డేటింగ్ వార్తలకు బలాన్ని చేకూర్చింది.
వచ్చే ఏడాది తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా పెళ్లి జరుగనుందట. వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపినట్లు సమాచారం. జనవరిలో పెళ్లి కబురు వినిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓ శాంతి శాంతి శాంతిః సినిమా జనవరి 23న రిలీజ్ కాబోతుంది. అలాగే ఈషారెబ్బ ప్రధాన పాత్రలో నటించిన 3 రోజెస్ సీజన్ 2 శనివారం ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Also Read – Balayya: పవన్ కోసం తన సినిమా పోస్ట్ పోన్ చేసుకున్న బాలయ్య!

