Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభHaripriya : పెళ్లి చేసుకోబోతున్న పిల్ల జమిందార్ హీరోయిన్.. ఎవర్నో తెలుసా??

Haripriya : పెళ్లి చేసుకోబోతున్న పిల్ల జమిందార్ హీరోయిన్.. ఎవర్నో తెలుసా??

- Advertisement -

Haripriya : సినిమా వాళ్ళు ఇటీవల వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్ పెళ్లి చేసుకోగా, నేడు హన్సిక పెళ్లి చేసుకోబోతుంది. త్వరలో మరో హీరో, హీరోయిన్ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు. తెలుగులో పిల్ల జమిందార్ సినిమాతో పలకరించిన హరిప్రియ తెలుగులో కొన్ని సినిమాలే చేసినా కన్నడలో మాత్రం హీరోయిన్ గా చాలానే సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా కన్నడలో వరుసగా సినిమాలు చేస్తుంది.

తాజాగా హరిప్రియ కన్నడ నటుడు వసిష్ఠ సింహని నిశ్చితార్థం చేసుకుంది. వసిష్ఠ హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పలు కన్నడ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల KGF సినిమాలో కూడా నటించాడు. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేశాడు. వసిష్ఠ, హరిప్రియ కలిసి గతంలో ఓ సినిమాలో కలిసి నటించారు. అప్పట్నుంచి వీరి మధ్య స్నేహం మొదలై అనంతరం ప్రేమగా మారింది.

గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల మధ్యే సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. హరిప్రియ, వసిష్ఠ కలిసి దిగిన ఓ ఫొటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసి తాము నిశ్చితార్థం చేసుకున్నామని తెలిపారు. వీరు కూడా ఆత్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News