స్టార్ హీరోయిన్ సమంతకు(Samantha) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత కొద్ది రోజులుగా ఎక్స్(X) ప్లాట్‌ఫామ్‌కు దూరంగా ఉంది. కేవలం ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లోనే యాక్టివ్ గా ఉండేది. తాజాగా Xలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ట్విట్టర్‌లో 10.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
రీఎంట్రీ సందర్భంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద స్వయంగా నిర్మించిన శుభం సినిమాను పోస్టు చేసింది. హర్రర్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సి.మలిరెడ్డి, శ్రీయ కొంఠెం, చరణ్ పెరి, షాలిని కొండెపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.