ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నది రెండు విషయాలలో. ఒకటి వారణాసి సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ గురించి అయితే, రెండవది ఈ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి హనుమంతుడిపై చేసిన కామెంట్స్. రాజమౌళి ఇలా హనుమంతుడిపై చేసిన కామెంట్స్ కి ఆయనపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేరుగానే ఆయన మీద కామెంట్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..!
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న అత్యంత భారీ పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా ఎస్ఎస్ఎంబి 29గా, గ్లోబ్ ట్రాటర్ గా చెప్పుకున్నారు. దాదాపు అందరూ పాన్ వరల్డ్ సినిమా కాబట్టి, గ్లోబ్ ట్రాటర్ నే టైటిల్ గా ఫిక్స్ చేస్తారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే, ఇటీవల వచ్చిన ‘సంచారి’ సాంగ్ తర్వాత అదే టైటిల్ ని ప్రకటించనున్నారని వినిపించింది.
కానీ, గత కొన్ని నెలల నుంచి మాత్రం వారణాసి అనే టైటిల్ నే రాజమౌళి ప్రకటిస్తారని న్యూస్ స్ప్రెడ్ అయింది. చివరికి అదే నిజమైంది. చిన్న గ్లింప్స్ తో పాటు మహేష్ లుక్ ని రివీల్ చేస్తూ వారణాసి టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. అయితే, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..హనుమాన్ రాజమౌళి వెనకాల ఉండి ఈ సినిమాను తీయిస్తున్నట్టుగా చెప్పారు. కానీ, రాజమౌళి మాత్రం దీనిని వ్యతిరేకిస్తూ నాకు దేవుడిపై నమ్మకం లేదు. టెక్నికల్ గ్లిచ్ వల్ల గ్లింప్స్ ఆలస్యం అయింది.
మా నాన్న అలా వెంటనే నాకు కోపం వచ్చింది. ఇదేనా హనుమాన్ నడిపించేది..అంటూ చెప్పుకొచ్చారు. దాంతో, కొందరు..గ్లింప్స్ ఆలస్యానికి కారణం మీ ప్లానింగ్. ఇంత చిన్నదానికి దేవుడిని నింధించడం సబబు కాదని, రాజమౌళి పై కొన్ని హిందూ సంఘాల వారు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే..గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా టైటిల్ అండ్ మహేష్ లుక్ కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కి గ్లోబ్ ట్రాటర్ గ్రాండ్ ఈవెంట్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు జక్కన్న. కాగా, ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని గా, పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు.

