Sunday, November 10, 2024
Homeచిత్ర ప్రభHit 2 Trailer : హిట్ 2 ట్రైలర్.. సూపర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా..

Hit 2 Trailer : హిట్ 2 ట్రైలర్.. సూపర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా..

- Advertisement -

Hit 2 Trailer : నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా హిట్ 2 సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. గతంలో విశ్వక్ హీరోగా వచ్చిన హిట్ సినిమాకి సీక్వెల్ గా రాబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని పూర్తిగా సస్పెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలా తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం హిట్ 2 టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అందరికి ఆసక్తి పెంచిన చిత్ర యూనిట్ తాజాగా హిట్ 2 ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ స్పెషల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఒక అమ్మాయిని హత్య చేసి ముక్కలుగా కోస్తే ఆ హంతకుడు ఎవరు అనేది కనిపెట్టడానికి అడివి శేష్ ప్రయత్నిస్తాడు. అయితే ఆ ముక్కలు ఒక్క అమ్మాయివి కాదు, వేరేవేరే అమ్మాయిలు అని తెలియడంతో షాక్ అవుతారు. మరి హంతకుడిని అడవి శేష్ ఎలా పట్టుకున్నాడు అనేదే కథ.

ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శేష్ కి హీరోగా, నానికి నిర్మాతగా ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News