Saturday, June 21, 2025
Homeచిత్ర ప్రభHIT 3 Collections: బాక్సాఫీస్ దగ్గర నాని ‘హిట్ 3’ కలెక్షన్ల సునామీ

HIT 3 Collections: బాక్సాఫీస్ దగ్గర నాని ‘హిట్ 3’ కలెక్షన్ల సునామీ

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ 3’(Hit 3) మూవీ మే 1న విడుదలైంది. ‘హిట్‌’ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన ఈ చిత్రంలో అర్జున్‌ సర్కార్‌ పాత్రలో నాని రెచ్చిపోయాడు. సాఫ్ట్‌గా కనిపిస్తూనే వైలెంట్‌గా నటించాడు. దీంతో తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తొలి రోజే రూ.43 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

- Advertisement -

ఇక రెండు రోజుల్లో ప్ర‌పంచవ్యాప్తంగా రూ.62 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను కలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. వీకెండ్ కావడంతో వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News