Friday, June 20, 2025
Homeచిత్ర ప్రభRamcharan: రామ్ చరణ్ కుమార్తె క్లీంకార ఇప్పుడు ఎలా ఉందంటే..?

Ramcharan: రామ్ చరణ్ కుమార్తె క్లీంకార ఇప్పుడు ఎలా ఉందంటే..?

Ramcharan- Upasana Daughter: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంప‌తులకు రెండు సంవత్సరాల క్రితం పాప జన్మించిన సంగతి తెలిసిందే. పాపకు అమ్మవారి ప్రతిరూపమైన క్లీంకార అనే పేరు పెట్టారు. అయితే పాప ఫేస్ మాత్రం ఇంతవరకు సరిగా రివీల్ కాలేదు. తమ పాప ఫేస్ బయటపడకుండా చెర్రీ దంపతులు చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. అయితే ఉపాసన తమ కుటుంబానికి సంబంధించిన అప్టేడ్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. తాజాగా ఇవాళ క్లీంకార రెండో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా జూలో తెల్లపులితో దిగిన ఫొటోను ఆమె షేర్ చేసుకున్నారు.

- Advertisement -

ఏడాది క్రితం అది కేవలం ఒక చిన్న పులి పిల్ల అని కానీ ఇప్పుడు ఉత్సాహవంతమైన ఆడపులి అని పేర్కొన్నారు. దానికి తమ కుమార్తె క్లీంకార పేరునే పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈవిధంగా ప్రేమాభిమానాలు చూపించిన హైదరాబాద్‌ జూ బృందానికి ధన్యవాదాలు చెప్పారు. వన్యప్రాణులు అడవికే సొంతమైనప్పటికీ వాటిని సంరక్షణకు మద్దతు తెలుపుతుంటామని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె షేర్ చేసుకున్న ఫొటోలో ఉపాసన – క్లీంకార ఆ ఆడపులిని చూస్తూ కనిపించారు. అయితే ఈ ఫొటోలో కూడా పాప పేరు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కాగా హైదరాబాద్‌లోని జూలో ఉండే పులి పిల్లను ఉపాసన దత్తత తీసుకున్నారు. ఈమేరకు వాటి పోషణకు అవసరమైన డబ్బులను జూ పార్క్ డైరెక్టర్‌కు అందజేశారు. దీంతో దత్తత తీసుకున్న పిల్లకు జూసిబ్బంది క్లీంకార అనే పేరు పెట్టడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక జగపతిబాబు, తదితరులు కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News