Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభHrithik Roshan: మేం లేకుండా పార్టీనా ?

Hrithik Roshan: మేం లేకుండా పార్టీనా ?

ఆర్ యు రెడీ టు రాక్ అండ్ రోర్ ?

కమాన్.. ఇక జోక్స్ వద్దు..మేం లేకుండా పార్టీనా.. అదంలా చేసుకుంటారని నిలదీస్తున్నాడు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలిగా.. హృతిక్-దీపిక కలిసి డ్యాన్స్ ఫ్లోర్ దుమ్ము లేపే పాటే దీనికి కారణమని. ఇప్పటికే ఫైటర్ సినిమాలోని వీరి డ్యూయట్ ఎక్కడ చూసిన మారుమోగుతోంది. దీంతో న్యూ ఇయర్ పార్టీల్లో ఈ పాట లేకుండా అస్సలు పార్టీలే ఉండవని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

- Advertisement -

హృతిక్, దీపిక, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఓబెరాయ్ లు కనపడే ఈ పార్టీ సాంగ్ లో అనిల్ కపూర్ సడన్ సర్ప్రైజ్ చేస్తారు. దీంతో ఈ పాటను ట్వీట్ చేసిన దీపిక.. ఆర్ యు రెడీ టు రాక్ అండ్ రోర్ అంటూ ఫ్యాన్స్ కు మెసేజ్ పెట్టి హుషారు నింపారు.

ఫైటర్ లోని షేర్ ఖుల్ గయే అనే పాట మీరు విన్నా, చూసినా లవ్లో పడటం ఖాయమని అప్పుడే బాలీవుడ్ పండిట్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జనవరి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రోమోలు, ట్రేలర్స్ భలే వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News