Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభWAR 2 Trailer: నువ్వా నేనా!..పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా ‘వార్ 2’.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

WAR 2 Trailer: నువ్వా నేనా!..పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా ‘వార్ 2’.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

WAR 2 Trailer: Telugu: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరూ ఐకానిక్ యాక్టర్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ 25 ఏళ్ల నట ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇదే సందర్భంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తుండటం విశేషం. ఆ సినిమాయే ‘వార్ 2’. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ బ్యానర్‌లో రూపొందిన ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీగా వార్ 2 ఆగస్ట్ 14న సందడి చేయనుంది.

- Advertisement -

వార్ 2తో బాలీవుడ్‌ ఆడియెన్స్‌కి మరింత కనెక్ట్ కావటానికి ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారనేది సుస్పష్టం. వార్‌కు కొనసాగింపుగా వస్తోన్న వార్ 2పై అంచనాలు భారీగానే ఉన్నాయి. నార్త్ ఆడియెన్స్‌తో పాటు ఈసారి సౌత్ ఆడియెన్స్ సైతం వార్ 2 కోసం వెయిటింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు. అందుకు ప్రధాన కారణం ఎన్టీఆర్. ఇందులో ఆయన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించాడు. విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.

Also Read – Today gold Rates:  పసిడి ప్రియులకు ఊరట.. తులం బంగారం పై కాస్త తగ్గిన రేటు..!

తాజాగా మేకర్స్ వార్ 2 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ వైపు హృతిక్, మరో వైపు ఎన్టీఆర్‌ నటించిన యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్‌ను చూపిస్తూ వచ్చారు. ఇక ఇద్దరూ గొడవపడే సీన్‌తో ట్రైలర్ ఎండ్ అయ్యింది. ఇద్దరూ గొప్ప నటులు నువ్వా నేనా అని పోటీ పడి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆడియెన్స్‌కి ఎప్పటికీ గుర్తుండి పోతుందనటంలో సందేహం లేదు. ట్రైలర్ చూస్తుంటే దేశం కోసం ఇద్దరు సైనికుల మధ్య జరిగే యుద్ధంగా సినిమాను రూపొందించారని తెలుస్తోంది.

ఇక కియారా అద్వానీ ఇందులో కథానాయిక. బికినీతో సెగలు పుట్టించేలా నటించిన ఈ బ్యూటీ గ్లామర్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ పీక్స్ అనేలా నటించింది. వార్ 2 సినిమా హిందీ, తెలుగు, తమిళ, భాషల్లో ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా బారీగా విడుదలవుతుంది. తెలుగు విషయానికి వస్తే నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సినీ సర్కిల్స్ లో వినిపిస్తోన్న వార్తల మేరకు వార్ 2 తెలుగు హక్కులను నాగ వంశీ రూ.80 కోట్లకు కొన్నారు. మరి సినిమా ఇక్కడ హిట్ కావాలంటే రూ.170 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రావాలి. మరి చూడాలి సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందోనని.

Also Read – viral: వరదల్లో చిక్కుకున్న విద్యార్థులు.. మనుషులే వంతెనగా మారి సాయం.. వీడియో ఇదిగో!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad