హీరో రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్య(Lavanya) కేసు మరోసారి తెరపైకి వచ్చింది. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అని, తన ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో నగ్నంగా ఉన్న రికార్డింగ్ వీడియోలు గుర్తించారు. ఈ వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ వీడియోల్లో హీరో నిఖిల్(Nikhil)కు చెందిన ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయి. మస్తాన్ సాయి నిఖిల్ ఫోన్ హ్యాక్ చేసి ఈ వీడియోలు సేవ్ చేసుకున్నట్లు తేలింది.
కాగా రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం విధితమే. దీంతో పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు కూడా నమోదు చేశారు. రాజ్ తరుణ్‌పై ఆరోపణలు చేసిన కొన్ని రోజులకు మస్తాన్ సాయి వల్లే తాము విడిపోయాము అంటూ ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి, లావణ్య గతంలో ఓసారి అరెస్ట్ కావడం గమనార్హం. దీంతో ఈ కేసు మరోసారి సంచలనంగా మారింది. మస్తాన్ సాయి వద్ద ఉన్న ప్రైవేట్ వీడియోలు ఎవరివి? అందులో ఎవరైనా సెలబ్రిటీల వీడియోలు ఉన్నాయా? అని సందేహాలు నెలకొన్నాయి. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.