‘ఐయామ్ గేమ్’ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరిస్తాననే నమ్మకం తనకుందని హీరో దుల్కర్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. వే ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాణమైన ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, “ఇది నా ప్రొడక్షన్‌లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్. నేను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ఇది తెలుగులో తీసిన ఒక పెద్ద సినిమాలాగే ఉంది అని చెప్పారు. ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్ మీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు హీరోలను ఆదరించడంలో చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. ఈ సినిమాకు స్వయంగా నేనే డబ్బింగ్ చెప్పాను. నాగ్ అశ్విన్ ఎడిటింగ్‌లో కూడా హెల్ప్ చేశారు” అని చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ. “ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా నేను కొంత చూశాను. ఇందులోని కాన్సెప్ట్‌కు అందరూ సర్‌ప్రైజ్ అవుతారు. ఇందులో చాలా ఫన్ ఉంటుంది. ‘మహానటి’ నుంచి ఆయనతో నాకు జర్నీ ఉంది. ఆయన కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చే నటుడు” అని అన్నారు. ఆంటోనీ వర్గీస్ మాట్లాడుతూ, “హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి కల్చర్ నాకు చాలా నచ్చింది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది” అని పేర్కొనగా…ఇంకా ఈ ఈవెంట్ లో నిర్మాత సందీప్ గుణ్ణం, కదిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.
Dulquer Salmaan: ‘ఐయామ్ గేమ్’ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది.. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

