i bomma: కమర్షియల్ సినిమాలే కాదు.. కంటెంట్ ఉన్న బయోపిక్స్‌ను చేయటానికి కూడా మూవీ ఇండస్ట్రీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉండే వ్యక్తుల జీవితాలను సిల్వర్ స్క్రీన్‌పై చూపించటానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తుల జీవితాలనే కాకుండా.. హర్షద్ మెహతా వంటి వ్యక్తుల లైఫ్ ను కూడా తెరకెక్కిస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో చేరిన వ్యక్తి.. ఇమ్మడి రవి. కొన్ని రోజుల నుంచి ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోతుంది.
తెలుగు సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తోన్న ఐ బొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు ఎన్నో సంవత్సరాలుగా పైరసీతో సినీ ఇండస్ట్రీని, పోలీసులను ఇబ్బంది పెట్టిన రవి.. ఒకానొక దశలో దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ కూడా చేశాడు. అయితే ఎట్టకేలకు పోలీసుల పక్కా ప్లానింగ్‌తో అతడిని అరెస్ట్ చేసి ఆ వెబ్ సైట్‌ను బ్లాక్ చేయించారు.
Also Read – Manya Anand: ధనుష్ మేనేజర్ మీద క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు
సినీ ఇండస్ట్రీ రవి అరెస్ట్‌పై సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే మధ్య తరగతి ప్రజల్లో కొంత మంది రవిని హీరో అంటున్నారు. అందుకు కారణం.. టికెట్ ధరలను భారీగా పెంచి సామాన్యులను థియేటర్స్ కు రానీయకుండా చేస్తుంటే.. అలాంటి వారి కోసం ఐ బొమ్మలో క్వాలిటీ ప్రింట్ సినిమాలను అప్ లోడ్ చేసి అందరికీ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చాడని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థ రవి జీవితాన్ని సినిమాగా తీయటానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఆయన జీవితంలో జరిగిన మార్పులు, చేసిన పోరాటం.. ఈ క్రమంలో తనకు ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమించి ఎలా సినీ ఇండస్ట్రీకి సమస్యగా మారాడు. చివరికి పోలీసులకు ఎలా పట్టుబడ్డాడు అనే విషయాలతో సినిమా నిర్మించబోతున్నారు. మరి అందులో రవి పాత్రలో ఎవరు నటిస్తారు.. అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Also Read – Anupama Parameswaran: 2025లో ఏడో సినిమా – లాక్‌డౌన్ రిలీజ్ డేట్ ఫిక్స్ – అనుపమ పరమేశ్వరన్ రికార్డ్

