Abusive comments on Renu Desai Accused Arrested: ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన రుంజాల చెన్నయ్యగా పోలీసులు గుర్తించారు.
Also Read: https://teluguprabha.net/telangana/government-reorganizes-admission-and-fee-regulatory-committee/
ఇటీవల రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక రీల్‌పై, చెన్నయ్య తన యూట్యూబ్ ఖాతా ద్వారా దూషిస్తూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు వీధి కుక్కల సంరక్షణ వంటి సామాజిక అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరిస్తూ దూషణలకు దిగారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, రేణు దేశాయ్ వీడియో విడుదల చేశారు. గత కొంతకాలంగా తనపై, తన పిల్లలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్, వేధింపులపై తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం గురించి దూషణలకు పాల్పడటంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంటికొచ్చి మీ తల్లిదండ్రుల ఎదుటే ప్రశ్నిస్తానంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రేణుదేశాయ్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించి గుంటూరులో చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వేధింపులకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/alert-severe-summer-temperatures-for-the-next-three-days/
ఇలా సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడటంపై సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో అజ్ఞాతంగా ఉంటూ ఇతరులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై నమోదైన కేసులు వారి భవిష్యత్తు, కెరీర్‌పై ప్రభావం చూపుతాయని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలని హితవు పలికారు.

