Balakrishna: వివేక్ ఆత్రేయ ఇంత వరకు పెద్ద హీరోలతో పని చేయలేదు. శ్రీ విష్ణు, నాని వంటి మిడ్ రేంజ్ యాక్టర్లతోనే చేశాడు. ఇక వివేక్ ఆత్రేయ కెరీర్‌లో చెప్పుకోదగ్గ మాస్ హిట్లు కూడా లేవు. కానీ ఈ మాస్ గాడ్‌తో వివేక్ ఆత్రేయ అవకాశం కొట్టేశాడని సమాచారం. బాలయ్యతో వివేక్ ఆత్రేయ మూవీ కన్ఫామ్ అయిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి నిర్మిస్తుందట. మరి ఈ మేరకు ప్రకటన ఎప్పుడు వస్తుంది? అసలు ఇందులో ఎంత నిజం ఉంది? వీటిపై క్లారిటీ ఎప్పుడు వస్తుంది? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
బాలయ్య ఇక వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరగా అఖండ 2 అంటూ బాలయ్య విధ్వంసం సృష్టించాలని అనుకున్నాడు. కానీ అది అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. మొదటి పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఆ స్థాయిలో మళ్లీ ఈ రెండో పార్ట్ ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాలయ్య, బోయపాటి శ్రీను ఇద్దరూ కాస్త డల్ అయినట్టుగా తెలుస్తోంది. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ అఖండ 2 వల్ల కోట్లలో నష్టపోయినట్టుగా తెలుస్తోంది.
Also Read – Ramayana: శ్రీరామనవమికి అదిరే అప్డేట్.. రామాయణ టీం ప్లానింగ్ ఇదే
ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో కలిసి మూవీని చేస్తున్నాడు. వీర సింహా రెడ్డి తరువాత మళ్లీ వీరి కాంబో సెట్ అయింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్ అని ప్రకటించేశారు. అంతా ఓకే అనుకునే టైంకి మొత్తం కథను మార్చేశారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, భారీ బడ్జెట్ అని ముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు బడ్జెట్‌ని కంట్రోల్ చేయాలని మొత్తం కథని, స్క్రిప్ట్‌ని, అందులోని బ్యాక్ డ్రాప్‌ని కూడా మార్చేశారట. మరి హీరోయిన్‌గా నయనతార ఉంటుందో లేదో చూడాలి.
ఇక బాలయ్య తన లైనప్‌లో వివేక్ ఆత్రేయని కూడా పెట్టారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. వివేక్ ఆత్రేయతో బాలయ్య గనుక మూవీ చేస్తే.. ఎలాంటి జానర్‌లో చేస్తాడు? బాలయ్య స్టైల్లో మూవీ ఉంటుందా? వివేక్ ఆత్రేయ తన స్టైల్లో సున్నితమైన కథాంశంతో వస్తాడా? అన్నది చూడాలి. వివేక్ ఆత్రేయ చివరగా అంటే.. సుందరానికీ చిత్రంతో ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
Also Read –

