Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభSSMB 29: మహేష్, రాజమౌళి మూవీ రన్ టైమ్ .. వామ్మో మరీ అంతనా!

SSMB 29: మహేష్, రాజమౌళి మూవీ రన్ టైమ్ .. వామ్మో మరీ అంతనా!

Mahesh – Rajamouli: రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తుంటారు. అంతటి ఆసక్తిని అందరిలో రేకెత్తించారు దర్శకధీరుడు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా విషయంలో ఊహించలేకుండా అంచనాలున్నాయి. మహేష్ బాబు కెరీర్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే జక్కన్నతో చేస్తున్న తన 29వ సినిమా ఒక్కటే ఒకెత్తు.

- Advertisement -

ఈ సినిమా మహేశ్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో, ఇండియన్ సినిమా రేంజ్‌ని ఇప్పుడు ఉన్నదానికి పదింతలు పెంచుతుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇదే వైబ్‌తో అటు అభిమానులు ఇటు సినీ వర్గాలు ఉన్నాయి. మహేశ్ – రాజమౌళి సినిమా మొదలై శరవేగంగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఒకటి రెండు పిక్స్ తప్ప అధికారికంగా ఏ అప్‌డేట్‌ని రివీల్ చేయలేదు. రాజమౌళి తీసిన బాహుబలి సిరీర్, త్రిపులార్ చూశాక అందరికీ మహేశ్ సినిమాని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తామా.? అని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురుచూస్తున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vishnu-manchu-pan-india-movie-kannappa-review/

ఇక మహేశ్ సినిమాకి సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా రాజమౌళి కెరీర్‌లో ఇప్పటి వరకూ తీసిన సినిమాలు మాత్రమే కాకుండా, మిగతా భారీ బడ్జెట్ సినిమాలతో పోల్చి చూసుకున్నా ఎక్కువ రన్‌టైమ్‌తో ఉండబోతోందని తెలుస్తోంది. మహేశ్ సినిమా రన్‌టైమ్ కాస్త అటు ఇటుగా 200 నిమిషాలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. అంటే 3 గంటల 20 నిమిషాల రన్‌టైమ్ అనమాట. వాస్తవానికి ఇలాంటి రన్‌టైమ్ ఉన్న సినిమాలు బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే వచ్చాయి. అప్పట్లోనే ప్రేక్షకులు రన్‌టైమ్ పట్టించుకోకుండా ఆదరించారు.

అయితే, రాను రాను సినిమాల రన్‌టైమ్ బాగా తగ్గింది. కొన్ని కామెడి సినిమాలైతే 2 గంటల 15 నిమిషాల లోపే ఉన్నాయి. కమర్షియల్ సినిమాలకి కూడా 2 గంటల 20 నుంచి 30 నిమిషాల లోపే రన్‌టైమ్ ఫిక్స్ చేస్తున్నారు. రాజమౌళి తీసిన త్రిపులార్ రన్‌టైమ్ కూడా 3 గంటల 2 నిమిషాలు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తున్న సినిమా దీనికి మించి పోతుందని ఇట్టే తెలిసిపోతుంది. అయితే, జక్కన్న మూడు గంటలు కాదు.. మూడున్నర గంటలు కూరోబెట్టినా ఆడియన్స్ సీట్ అంచున కూర్చొని సినిమా చూస్తారు. అంతగా ఎంగేజ్ చేసేస్తారు. కాబట్టి, రాజమౌళి సినిమాకి రన్‌టైమ్ అసలు మ్యాటరే కాదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News