Friday, February 13, 2026
Homeచిత్ర ప్రభMega158: బాబీ, చిరు చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా మోహన్ లాల్?

Mega158: బాబీ, చిరు చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా మోహన్ లాల్?

Mega158: మెగాస్టార్ చిరంజీవి, బాబీ మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ ఈ కాంబో సెట్ అయింది. సౌత్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ సంస్థగా నిలిచిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే కథలో చాలా మార్పులు, చేర్పులు వచ్చాయి. బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకునే కథను అల్లాడట బాబీ. ఇక ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్ని బట్టి ప్రయోగాలు చేయకూడదని ఫిక్స్ అయ్యారట. అందుకే కథను మళ్లీ పూర్తిగా మార్చి బాబీ సరికొత్త కథను రూపొందించినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

కొత్త కథకు సంబంధించిన స్క్రిప్ట్ పనులకే టైం ఎక్కువ కేటాయిస్తున్నారట. అందుకే షూటింగ్‌కు ఇంకా టైం తీసుకుంటున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో చిరంజీవితో పాటుగా మోహన్ లాల్ కూడా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారట. ఈ మేరకు గత కొన్ని రోజులుగా లీకులు వస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో మోహన్ లాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని లేటెస్ట్ లీకులు చెబుతున్నాయి. దీనిపై మేకర్లు క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Also Read- Sandakari Movie: రిలీజ్ కానీ సినిమాకు మూడు అవార్డులు ఇచ్చిన ప్ర‌భుత్వం – ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

చిరంజీవి రీసెంట్‌గానే మన శంకర వర ప్రసాద్ గారు అంటూ ఇండస్ట్రీ హిట్‌ను సాధించారు. ఇక ఇప్పుడు విశ్వంభర పనుల్లో చిరు బిజీగా ఉన్నారు. ఈ మూవీని జూలైలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అయితే చిరు కాస్త రెస్ట్ మోడ్‌లోనే ఉన్నారు. ఇక మెగా ఇంట్లో జరిగిన సంబరాలు అందరూ చూసి ఉంటారు. రామ్ చరణ్, ఉపాసనలు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో చిరంజీవి మరింత ఆనందంగా ఉన్నారు. మగ బిడ్డ, ఆడ బిడ్డ పుట్టారని చిరు ఎంతో సంతోషించారు.

ఇక దొరికిన ఈ గ్యాప్‌లో మనవడు, మనవరాలితోనే గడిపేలా ఉన్నారు. ఒక వేళ బాబీ తన స్క్రిప్ట్‌ని ఫినిష్ చేస్తే మార్చిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మధ్యలో విశ్వంభర కోసం అయితే షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ మూవీని వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేసినా.. అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

Also Read- Meenakshi Chaudhary :మీనాక్షి చౌదరి మెరుపులు.. పచ్చని లెహంగాలో పరువాల విందు.!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News