Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభNiharika: అన్న చిత్రాన్ని నిర్మిస్తున్న నిహారిక?

Niharika: అన్న చిత్రాన్ని నిర్మిస్తున్న నిహారిక?

Niharika – Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఫిదా, లవ్ స్టోరీ తరువాత వరుణ్ తేజ్ చేసిన ఏ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. మధ్యలో వరుణ్ తేజ్ మాస్ ఇమేజ్ కోసం పరితపించి చేసిన చిత్రాలన్నీ కూడా బోల్తా కొట్టేశాయి. డిజాస్టర్లతో వరుణ్ తేజ్ అసలు తన మార్కెట్ మీదే అందరికీ అనుమానం కలిగేలా చేశాడు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ డిఫరెంట్ కథల్ని ఎంచుకుని, హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం కమ్ బ్యాక్ ఇస్తాడా? లేదా? అని మెగా ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నారు.

- Advertisement -

వరుణ్ తేజ్ ప్రస్తుతం 2026 వేసవిలో విడుదల కానున్న కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ కామిక్ ఎంటర్టైనర్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఇది కాకుండా వరుణ్ తేజ్ ఇప్పుడు రెండు కొత్త సినిమాలు లైన్ లో పెట్టాడు. వాటిలో ఒకటి అతని సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తుందని సమాచారం.

Also Read – SP Venkatesh: నేలకొరిగిన సంగీత శిఖరం.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ వెంకటేశ్ కన్నుమూత

నిహారిక నిర్మాతగా మంచి విజయాల్ని అందుకుంటోంది. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో నిహారిక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె గత సంవత్సరం కమిటీ కుర్రోళ్లును నిర్మించింది. కమిటీ కుర్రోళ్లు వంశీ ఎదు వరుణ్ తేజ్ కోసం ఒక స్క్రిప్ట్ ను చెప్పాడట. పైగా ఆ స్క్రిప్ట్ కూడా వరుణ్ తేజ్‌కి బాగానే నచ్చిందట. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఈ ఎంటర్టైనర్‌ను నిర్మించబోతోందట. అంతే కాకుండా త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన వెలువడనుందట. వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్టుతో పాటుగా మరో సినిమాకు కూడా సంతకం చేశాడట.

వరుణ్ తేజ్ హీరోగా అట్లీ అసోసియేట్ బాలాజీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రాబోతోందట. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ సంవత్సరం ప్రారంభమవుతుందట. స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తారట. టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండతో వరుణ్ తేజ్ చర్చలు జరుపుతున్నాడట. ఇక ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హోల్డ్‌లో ఉందని సమాచారం. ఈ సంవత్సరం వరుణ్ ఈ రెండు సినిమాలను ఓకే చేయనున్నట్టుగా టాక్.

Also Read – Ram Pothineni: ఆర్కా మీద అలిగిన రామ్?.. అందుకే వద్దని అనుకున్నాడా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News