Pooja Hegde: అనిల్ రావిపూడి టాలీవుడ్‌కు గోల్డెన్ హ్యాండ్. ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంటుంది. లోకల్ రాజమౌళిగా అనిల్ రావిపూడికి పేరు వచ్చేసింది. ఆయన తీసిన 9 చిత్రాలు.. ఆయా హీరోలకి, నిర్మాతలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. అలా అనిల్ రావిపూడి దినదినాభివృద్ది చెందుతూనే ఉన్నాడు. అలా ఎదుగుతూ ఉన్నా.. అనిల్ రావిపూడికి విమర్శలు, ట్రోలింగ్ కూడా ఎదురవుతూనే ఉన్నాయి. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఎప్పుడూ కూడా తనపై వచ్చే విమర్శల్ని పట్టించుకోడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాడు.
సంక్రాంతికి రావడం, హిట్టు కొట్టడం.. అన్నది రిపీట్‌గా మారింది. సంక్రాంతికి సినిమాను రెడీ చేసేందుకు ఏడాది అంతా కష్టపడుతూనే ఉంటాడు. జనవరిలో సినిమాని రిలీజ్ చేస్తాడు. ఫిబ్రవరిలో కొత్త మూవీ పనులు స్టార్ట్ చేస్తాడు. జూన్, జూలై వరకు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చేస్తాడు. నవంబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. డిసెంబర్ అంతా కూడా ప్రమోషన్లకు కేటాయిస్తాడు. జనవరిలో సినిమాను సంక్రాంతి బరిలోకి దించి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. ఇదే అనిల్ రావిపూడి షెడ్యూల్.
Also Read- Meenakshi Chaudhary :మీనాక్షి చౌదరి మెరుపులు.. పచ్చని లెహంగాలో పరువాల విందు.!
ఇక ఇప్పుడు కూడా ఇంతే. మన శంకర వర ప్రసాద్ గారు మూవీని దించాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక వెంకీమామతో ఇంకో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. ఫిబ్రవరిలో ఆ మూవీని ప్రకటిస్తాడు. జూన్ లేదా జూలైకి సెట్స్ మీదకు వెళ్తాడు. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ లీక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకుంటాడని తెలుస్తోంది. అసలే పూజా హెగ్డే టైం ఇప్పుడు అంత బాగోలేదు. టాలీవుడ్ మేకర్లు ఆమె వైపు కూడా చూడటం లేదు.
వరుస ఫ్లాపులతో పూజా హెగ్డే ఎప్పుడో వెనకపడింది. అలాంటి భామని రైజింగ్ హ్యాండ్‌లో ఉన్న అనిల్ రావిపూడి తీసుకుంటున్నాడు. ఇక ఈ మూవీతో అయినా హిట్టు వస్తుందా? అనిల్ రావిపూడి ఆమెకు లైఫ్ ఇస్తాడా? అన్నది చూడాలి. అసలు హీరోయిన్‌గా ఫిక్స్ చేశారా? లేదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మరి అనిల్ రావిపూడి అండ్ టీం ఈ విషయం మీద క్లారిటీ ఎప్పుడు ఇస్తారో చూడాలి.
Also Read- Sandakari Movie: రిలీజ్ కానీ సినిమాకు మూడు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వం – ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

