Tuesday, February 17, 2026
Homeచిత్ర ప్రభVaranasi Release Date: ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఇదేనా?.. జక్కన్న ప్లాన్ అదుర్స్

Varanasi Release Date: ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఇదేనా?.. జక్కన్న ప్లాన్ అదుర్స్

Varanasi Release Date: దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి చేసే సినిమాలు, వాటి కోసం వేసే ప్రమోషనల్ స్ట్రాటజీలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు ‘వారణాసి’ కోసం జక్కన్న కూడా డిఫరెంట్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాడు. అందుకే మహేష్ బాబు పాస్ పోర్ట్ సీజ్ చేసినట్టుగా ప్రోమోని వదిలి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత పుటేజ్ లీకులు అయినా కూడా తన స్టైల్లో షూటింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశాడు. వారణాసి వరల్డ్‌ను పరిచయం చేస్తూ గ్లోబ్ ట్రోట్టర్ ఈవెంట్‌ను అంతర్జాతీయ మీడియాని సైతం ఆకట్టుకునేలా చేశాడు.

- Advertisement -

ఇక ఇదొక టైం ట్రావెల్ కథ అని రాజమౌళి చెప్పకనే చెప్పేశాడు. ఓ యుగం నుంచి ఇంకో యుగంకి ట్రావెల్ చేసే కథకు తన విజన్‌ను రాజమౌళి జోడించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో రాముడిగా మహేష్ బాబుని చూసి జక్కన్న ఫిదా అయ్యాడట. అలా రాముడి గెటప్‌లో మహేష్ బాబు ఫోటో షూట్ చేసిన తరువాత మురిసిపోయిన రాజమౌళి.. ఆ ఫోటోని ఫోన్ స్క్రీన్ మీద పెట్టుకున్నాడట. మళ్లీ ఆ లుక్ లీక్ అవుతుందని రాజమౌళి భయపడి ఫోటోని తీసేశాడట.

Also Read – Magha Purnima: 100 ఏళ్ల తర్వాత వచ్చే అరుదైన యోగం!

అలా మహేష్ బాబు పాత్రకి సంబంధించిన లీక్ చూసి అంతా అంచనాలు పెంచేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రమోషనల్ స్ట్రాటజీలో రాజమౌళి మరో అడుగు ముందుకు వేశాడు. వారణాసిలో కొన్ని హోర్డింగ్స్‌లు పెట్టించారట. అందులో సినిమాకు సంబంధించిన విషయం ఏమీ లేకుండానే.. కేవలం రిలీజ్ డేట్‌ను మాత్రం పెట్టారట. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారట. అసలు ఇది ఏ మూవీ కోసం? ఇది ఏ సినిమా? ఈ రిలీజ్ డేట్ ఏంటి? అని అంతా చర్చించుకోసాగారట.

అయితే అది వారణాసి మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అని.. అందుకే అలా వారణాసిలో హోర్డింగ్‌లో పెట్టించారట. ఏప్రిల్ 7 సరైన సీజన్ అని, ఉగాది, గుడి పడ్వా అని.. ఆ తరువాత అంబేద్కర్ జయంతి కూడా ఉందని, అలా వరుసగా సెలవుల సీజన్ కాబట్టే రాజమౌళి అలా ప్లాన్ చేసి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్, హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. కుంభా, మందాకిని పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పాత్రలు, రుద్ర పాత్రలో మహేష్ బాబు లుక్ చూసి మరింత బజ్ పెరిగిన సంగతి తెలిసిందే.

Also Read – Rithu Chowdary: ఏంజెల్ లా మెరిసిపోతున్న రీతూ చౌదరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News