Ram Pothineni: నిర్మాతలంతా కూడా ప్రస్తుతం హీరోల మార్కెట్‌ను, ప్రీవియస్ సినిమాల కలెక్షన్లు, వాటి రేంజ్‌ను బట్టే బడ్జెట్లను పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇది వరకు డిసైడ్ చేసిన బడ్జెట్‌లను సైతం మార్చేస్తున్నారు. అందుకోసం ఏకంగా కథల్ని కూడా తిరగరాస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య గోపీచంద్, చిరు బాబీ ప్రాజెక్టుల కథలు మారిపోయాయ్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ ఓ బడా సంస్థకి చేయనున్న ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేశాడు. ఆర్కా మీడియాతో చేయాల్సిన సినిమాని రామ్ వదిలేశాడని సమాచారం.
రామ్ సరైన హిట్టు కోసం ఎంతలా ప్రయత్నిస్తున్నాడో అందరికీ తెలిసిందే. రామ్‌కి సరైన హిట్టు పడి చాలా కాలం అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత స్కంద అంటూ మాస్‌లో అంతో ఇంతో వసూళ్లను సాధించాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ 2 డిజాస్టర్ అవ్వడం, స్కంద మీద దారుణమైన విమర్శలు రావడంతో తన పంథాను మార్చుకున్నాడు. మళ్లీ లవ్ స్టోరీ, కమర్షియల్ చిత్రాల్ని చేశాడు. అవి కూడా వర్కౌట్ కాలేదు. చివరకు కాస్త రూట్ మార్చి ఆంధ్రా కింగ్ తాలూకా అని చేశాడు. ఆ సినిమాకి అంతో ఇంతో మంచి టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు చూస్తే మాత్రం నిల్.
Also Read- Sravanthi Chokarapu: పచ్చని చీరలో స్రవంతి పరవశం.. ముత్యాల మెరుపులతో మైమరపిస్తున్న యాంకర్
దీంతో రామ్‌తో చేసే నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అందుకే ఆర్కా మీడియా రామ్ కోసం ఇచ్చిన బడ్జెట్‌ని కట్ చేసిందట. ఫిబ్రవరి నుంచి కొత్త దర్శకుడితో రామ్ మూవీని ఆర్కా ప్రారంభించాల్సి ఉందట. కానీ బడ్జెట్‌లో కోత విధించడంపై రామ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడని సమాచారం. దీంతో రామ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. ఇక ఆ ప్రాజెక్ట్‌ని రామ్ క్యాన్సిల్ చేసినట్టుగానే తెలుస్తోంది.
ఇవి కాకుండా రామ్ మరో రెండు కథల్ని ఓకే చేసి పెట్టాడట. కొత్త దర్శకులతోనే ఆ చిత్రాలు ఉంటాయని సమాచారం. ఇదే ఏడాదిలో ఆ రెండు సినిమాల్ని ప్రకటిస్తాడని అంటున్నారు. మరి ఆర్కా మీడియా సినిమా ఫిబ్రవరిలోనే స్టార్ట్ కావాల్సింది. కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ అయింది. మరి నెక్ట్స్ ఏ మూవీని స్టార్ట్ చేస్తాడో చూడాలి.
Also Read- Allu Sirish: పెళ్లి తర్వాతే అల్లు శిరీష్.. ‘మగజాతి ఆణిముత్యం’

