Shraddha Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన లైనప్‌తోనే అందరినీ భయపెట్టిస్తున్నారు. అట్లీ మూవీ సెట్స్ మీద ఉండగానే లోకేష్ కనకరాజ్‌తో ప్రాజెక్ట్‌ని ప్రకటించేశారు. ఇక వరుసగా కోలీవుడ్ దర్శకులతోనే బన్నీ చేస్తాడా? అనే అనుమానం కూడా అందరిలోనూ కలుగుతోంది. అయితే అట్లీ, లోకీ తరువాత సందీప్ వంగా, రాజమౌళి వంటి వారితో బన్నీ సినిమా చేస్తాడని అంతా భావిస్తున్నారు. మరి ఈ లైనప్ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ లోపు బన్నీ, లోకీ చిత్రంలో ఫీమేల్ లీడ్ గురించి వచ్చిన లీక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
బన్నీ, లోకీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్‌ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. సాహో తరువాత మళ్లీ సౌత్ చిత్రంలో శ్రద్దా కనిపించలేదు. పైగా శ్రద్దా కూడా తన వద్దకు వచ్చిన ప్రతీ సినిమా, కథని ఒప్పుకోవడం లేదు. ఆచితూచి ప్రాజెక్టుల్ని ఎంచుకుంటోందన్న సంగతి తెలిసిందే. చివరగా శ్రద్దా కపూర్ స్త్రీ 2 అంటూ బాక్సాఫీస్‌ను వణికించింది. దాదాపు 700 కోట్ల వరకు కలెక్ట్ చేసి శ్రద్దా కపూర్ తన స్టామినాను ఫ్రూవ్ చేసుకుంది.
Also Read – Chiranjeevi: కాజల్ ఎవరు? తమన్నా ఎవరు? అని అడిగాను – చిరంజీవి
స్త్రీ 2 తరువాత శ్రద్దా కపూర్ సైతం తన రెమ్యూనరేషన్‌ను భారీ స్థాయిలో పెంచేసిందని సమాచారం. బన్నీ, లోకీ టీం మాత్రం శ్రద్దా కపూర్‌ను ఫైనల్ చేయాలనే ఆలోచనల్లోనే ఉందట. ఈ మేరకు సినిమాలో ఫీమేల్ లీడ్ కోసం శ్రద్దా ఫస్ట్ ఛాయిస్‌గానే ఉంటుందని అంటున్నారు. మరి శ్రద్దా సైడ్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందా? అని అంతా అనుకుంటున్నారు.
లోకేష్ కనకరాజ్ బన్నీతో చేస్తున్న మూవీని డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో మరింత హైప్ ఏర్పడింది. ఎల్ సీ యూ ఆగిపోతుందా? ఇకపై వాటి జోలికి వెళ్లడా? అని లోకేష్ గురించి అంతా అనుకున్నారు. కానీ ఎల్ సీ యూ ఉంటుందని, బన్నీతో సినిమా తరువాత ఖైదీ 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. తాను ముందుగా చెప్పినట్టు విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు కూడా ఉంటాయని అన్నాడు.
Also Read – Fauzi: దసరా బరిలోకి ఫౌజీ.. త్వరలోనే మరింత క్లారిటీ!

