Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభRajinikanth: కూలీతో రిస్క్ చేస్తున్నారా..?

Rajinikanth: కూలీతో రిస్క్ చేస్తున్నారా..?

Rajinikanth Coolie: తమిళ సినిమా కథను మనవాళ్ళు రైట్స్ కొనుక్కొని ఇక్కడ హీరోకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రూపొందిస్తుంటారు. దాదాపుగా ఆ సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తుంటాయి. ఎక్కువగా సూపర్ గుడ్ ఫిలింస్ తమిళ చిత్రాలను తెలుగులో రీమేక్ చేస్తుంటారు. ఇక హీరోను బట్టి ఇక్కడ హక్కుల కోసం కూడా గట్టి పోటీ నెలకొంటుంది. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన దబాంగ్ సినిమా హక్కుల కోసం చెల్లించిన మొత్తం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు కూలీ సినిమా విషయంలో అలా ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది.

- Advertisement -

ఇటీవల చూసుకుంటే ఓ డబ్బింగ్ సినిమా హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ పడింది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ మూవీ కోసమే. రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కూలీ చిత్రానికి అటు తమిళంలో, ఇటు తెలుగులో ఊహించని రేంజ్‌లో హైప్ నెలకొంది. మరీ ముఖ్యంగా ‘జైలర్’ సినిమాని మించి ‘కూలీ’ సెన్సేషన్‌ని క్రియేట్ చేయబోతుందనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. రజినీ, లోకేష్ కాంబినేషన్‌‌కి మరో ప్లస్ పాయింట్ అక్కినేని నాగార్జున ఇందులో విలన్ పాత్రను చేయడం.

నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర లాంటి వారు సినిమా హైప్‌ను అమాంతం పెంచారు. ఈ నేపథ్యంలో తమిళంలో మొదటిసారి వెయ్యి కోట్ల సినిమా కూలీ అవుతుందని చెప్పుకుంటున్నారు. జైలర్, వేట్టయాన్ సినిమాలతో రజినీ వరుసగా భారీ కమర్షియల్ సక్సెస్‌లను సాధించారు. ఆ క్రేజ్ కూలీ సినిమా బిజినెస్‌కి ఎవరూ ఊహించని రీతిలో కలిసొచ్చింది. తెలుగులోనూ ఈ మూవీకి భారీ వసూళ్లు వస్తాయని ఊహించే డబ్బింగ్ రైట్స్ కోసం విపరీతంగా పోటీ నెలకొంది. ఏషియన్ సునీల్, సితార నాగవంశీ, డి. సురేష్ బాబు, అక్కినేని నాగార్జున..లాంటి వారు ఈ పోటీలో ఉన్నారు.

నిన్నా మొన్నటి వరకు నాగార్జుననే కూలీ సినిమా రైట్స్ ని సొంతం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. రూ.40 కోట్ల పైగానే రైట్స్ కోసం నాగ్ చెల్లించడానికి రెడీ అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ, చివరి నిమిషంలో ఏషియన్ సునీల్ కూలీ సినిమా హక్కులను దక్కించుకున్నట్లుగా సన్ పిక్చర్స్ వారు అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమా ద్వారా లాభాలు రావాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలి. చూడాలి మరి వార్ 2తో పోటీ పడబోతున్న కూలీ బాక్సాఫీస్ లెక్కలు ఎలా నమోదవుతాయో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News