Friday, January 16, 2026
Homeచిత్ర ప్రభNidhhi Agerwal: ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్‌కి స్క్రీన్ స్పేస్ అంతేనా? ఇది మరీ దారుణం!

Nidhhi Agerwal: ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్‌కి స్క్రీన్ స్పేస్ అంతేనా? ఇది మరీ దారుణం!

Nidhhi Agerwal: మరికొన్ని గంటల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్దికుమార్ నటించారు. ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ సీనియర్ నటులు బొమన్ ఇరానీ, సంజయ్ దత్, జరీనా వాహబ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే బెనిఫిట్ షోస్, ప్రీమియర్స్.. అలాగే పదిరోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం దక్కింది.

- Advertisement -

ఇక, ఈ సినిమా హర్రర్ అండ్ కామెడీ జోనర్‌లో దర్శకుడు మారుతి రూపొందించాడు. సంజయ్ దత్, జరీనా వాహబ్ ప్రభాస్ అమ్మమ్మ-తాతయ్యలుగా కనిపించబోతున్నారు. తాతను వెతుకుతూ ఉండే ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.. అనే కథాంశంతో ది రాజాసాబ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.

Also Read- Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు హుక్ స్టెప్‌తో రఫ్ఫాడించారు

ముఖ్యంగా థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుందని.. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కోసం థమన్ అందించిన బీజీఎం నెక్స్ట్ లెవల్ అని ఇన్‌సైడ్ టాక్. ది రాజాసాబ్ సినిమాకి ప్రధానంగా ప్రభాస్, థమన్ కీలకంగా మారారని అంటున్నారు. ఇప్పటి వరకూ ఎప్పుడు చేయనటువంటి ఈ సరికొత్త పాత్రలో డార్లింగ్ మెస్మరైజ్ చేయబోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. అయితే, హీరోయిన్స్ ఇందులో ముగ్గురున్నారు.

వీరిలో ఎవరి పాత్ర నిడివి ఎంత? అంటే మాళవిక మోహన్, రిద్దికుమార్ పాత్రలే కాస్త ఎక్కువ నిడివి ఉంటుందని, నిధి అగర్వాల్ పాత్ర నిడి తక్కువేనని స్వయంగా ఇటీవల ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతి చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ది రాజాసాబ్ సినిమా ఎంత పెద్ద హిట్టైనా నిధికి పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదని అర్థమవుతోంది. అసలే అమ్మడికి హీరోయిన్ ఛాన్సులు అంతంత మాత్రంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేసిన ది రాజాసాబ్ కూడా పేరు తెచ్చిపెట్టకపోతే తర్వాత పరిస్థితేంటి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి నిధికి ఈ సినిమా ఏమేరకు గుర్తింపు తెస్తుందో.

Also Read- Prabhas RajaSaab: జ‌న‌నాయ‌గ‌న్ వాయిదా… ప్ర‌భాస్ రాజాసాబ్‌కు క‌లిసిరానుందా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News