Sunday, January 18, 2026
Homeచిత్ర ప్రభNani - Sujeeth: నాని-సుజీత్ మూవీలో హీరోయిన్ ఆ బ్యూటీనేనా?

Nani – Sujeeth: నాని-సుజీత్ మూవీలో హీరోయిన్ ఆ బ్యూటీనేనా?

Nani – Sujeeth: నాని-సుజీత్ మూవీలో హీరోయిన్ ఆ బ్యూటీనేనా?.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాని సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ సాగుతోంది. గతంలో నాని-నివేదా థామస్‌లది మంచి పెయిర్‌గా చెప్పుకున్నారు. అలాగే, నాని-కీర్తి సురెష్‌ల గురించి మాట్లాడుకున్నారు. కానీ, మళ్ళీ నానికి అలాంటి జోడీ దొరకలేదు. కొత్త హీరోయిన్‌కి నాని ఛాన్స్ ఇవ్వడానికి బాగా ఇష్టపడతాడు.

- Advertisement -

అలా, నాని సినిమాల ద్వారా మెహ్రీన్, ప్రియంక అరుళ్ మోహన్ లాంటి వారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రియాంకతోనూ నాని సరిపోదా శనివారం అంటూ రెండవ సినిమాను చేశాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. హిట్ 3లో శ్రీనిధి శెట్టి నటించింది. హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఆశించిన విధంగా రాలేదు. అయితే, ఇప్పుడు నాని సినిమాకి హీరోయిన్ ఎంపిక కాస్త కష్టమవుతోందట.

Also Read – Prabhas: ప్రభాస్‌ని మారుతి నిజంగానే జోకర్‌ని చేశాడా?

కథకి తగ్గట్టుగా సరైన హీరోయిన్ ఫిట్ అవకపోతే సినిమాపై బాగా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అయితే, ప్రస్తుతం నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా రూపొందుతోంది. ఇంకా సగభాగం చిత్రీకరణ చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ పట్టాలెక్కినప్పటి నుంచి రీసెంట్‌గా హీరోయిన్‌ని ఫైనల్ చేశారు. డ్రాగన్, ఫంకీ సినిమాలతో హీరోయిన్ ఛాన్స్ అందుకున్న కయాదు లోహర్‌కి నాని ఛాన్స్ ఇచ్చాడు.

ఇక, నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవ్వాల్సి ఉంది. పవన్ కళ్యాణ్‌తో OG తీసి భారీ హిట్ అందుకున్న సుజీత్.. నెక్స్ట్ నాని కోసం అద్భుతమైన కథను తయారు చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు టాపిక్. ఇద్దరికీ ప్రియాంకతో మంచి బాండింగ్ ఉంది. కాబట్టి, నానికి జంటగా ప్రియాంకనే ఫిక్స్ చేస్తారా? అనే మాట ఒకటి వినిపిస్తోంది. అలాగే, కాంతార ఛాప్టర్ 1తో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ కూడా నాని-సుజీత్ దృష్టిలో ఉన్నట్టు తెలుస్తోంది. బ్లడీ రోమియో అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. ఆమధ్య హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వీరితో పాటు భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా వినిపిస్తోంది. మరి, ఈ ముగ్గురిలో ఎవరికి ఆ లక్కీ ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

Also Read – Mega 158: మెగా 158 ప్రాజెక్టులో మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News