Sreeleela Lenin Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం వేరే ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌నైనా వదులుకోవడానికి రెడీ అవుతారు కొందరు హీరోయిన్స్.
హరి హర వీరమల్లు సినిమా కోసం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఎంతగానో ఎదురుచూస్తుంది. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా లెవల్‌లో నిధికి వచ్చే
క్రేజ్ బాగానే ఉంటుంది. అందుకే, అమ్మడు ఈ సినిమాకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలాగే క్యూట్ హీరోయిన్ శ్రీలీల కూడా.
ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో మాస్ మహారాజ రవితేజ
సరసన మాస్ జాతర చిత్రాన్ని చేస్తోంది. అలాగే, తమిళంలో పరాశక్తి, హిందీలో ఆషికి 3 చిత్రాలు చేతిలో ఉన్నాయి. వీటితో పాటు పవర్ స్టార్ పవన్
కళ్యాణ్-స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్, అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ ఉన్నాయి. అయితే ఈ మధ్య అఖిల్
‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల బయటికి వచ్చేసిందనేలా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
లెనిన్ నుంచి గ్లింప్స్ కూడా వచ్చింది. ఇందులో శ్రీలీల లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. లంగా ఓణిలో చాలా చక్కగా ఉంది. దీంతో ఇన్ని సినిమాలకి గాను
లెనిన్ లో అఖిల్ కి సరైన జోడీ కుదిరిందని చెప్పుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ మూవీ నుంచి శ్రీలీల తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. తన స్థానంలో
మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరిందని సమాచారం.
అయితే, శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కోసమే లెనిన్ సినిమాను వదిలేసిందని నిన్నామొన్నటివరకు ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదట. పవన్ కల్యాణ్‌తో
సినిమా చేస్తున్న నేపథ్యంలో ఒకేసారి రెండు సినిమాలకి డేట్స్ సర్దుబాటు చేయలేక ఒక చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. తప్పని పరిస్థితుల్లో పవన్
వైపు మొగ్గుచూపి అఖిల్ సినిమా నుంచి తప్పుకుందనేది తాజా సమాచారం. ఇక భాగ్యశ్రీకి టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. కాబట్టి శ్రీలీల లెనిన్
నుంచి తప్పుకున్నా జరిగే నష్టమేమి లేదని చెప్పుకుంటున్నారు.