సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సోదాలు(IT Raids) కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప2 (Pushpa 2)మూవీలో ఆయన పెట్టుబడి పెట్టినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వెకేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే.. అధికారులు దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లడం గమనార్హం.
మరోవైపు నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా, వృద్ధి సినిమాస్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా మంగళవారం కూడా దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్‌లు ఓపెన్ చేయించారు.