Thursday, March 12, 2026
Homeచిత్ర ప్రభMegastar Chiranjeevi: మెగాస్టార్ భుజానికి కీహోల్ సర్జరీ

Megastar Chiranjeevi: మెగాస్టార్ భుజానికి కీహోల్ సర్జరీ

Chiranjeevi Sholuder Surgery: మెగాస్టార్ చిరంజీవి భుజం ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఇటీవల ఆయన చేతికి స్లింగ్‌తో కనిపించడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పష్టత ఇచ్చారు.

- Advertisement -

ఇది కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ (ఆర్థ్రోస్కోపీ) మాత్రమేనని, ప్రక్రియ సాఫీగా జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగా కోలుకుంటున్నానని, రోజువారీ పనులకు తిరిగి వస్తున్నానని తెలిపారు. ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆయన నైపుణ్యం, శ్రద్ధతో సర్జరీ ప్రక్రియ సౌకర్యవంతంగా జరిగిందని చిరంజీవి చెప్పారు.

ఇటీవల అల్లు శిరీష్ తన వివాహ ఆహ్వానపత్రాన్ని చిరంజీవికి అందజేసిన సందర్భంగా స్లింగ్‌తో కనిపించినప్పటినుంచీ ఆయన చేతికి ఏమైందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. వారికి తన తాజా పోస్ట్ ద్వారా స్పష్టతనిచ్చారు చిరంజీవి.

Santosh Sobhan: ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ

ప్రస్తుతం ఆయన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తెలుగు జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంపై సాధిస్తున్న రికార్డుల్ని ఆనందంతో ఆస్వాదిస్తున్నారు. వ్యక్తిగతంగా రాంచరణ్, ఉపాసన దంపతుల ద్వారా కవల పిల్లలు శివరాం, అన్వీరాదేవి కలగడంతో ఆయనలో ఉత్సాహం మరింత ఎక్కువైంది. విడుదల పెండింగులో ఉన్న ‘విశ్వంభర’పై దృష్టిపెట్టి దాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. జూలై రెండో వారంలో ఆ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News