Sunday, November 10, 2024
Homeచిత్ర ప్రభPunch Prasad : నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్

Punch Prasad : నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్

ఎందరో కమెడియన్స్ కి పేరును తెచ్చిపెట్టడంతో పాటు మంచి జీవితాన్నిచ్చింది జబర్దస్త్ కామెడీ షో. ఇటు షో చేస్తూనే.. మరో వైపు సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. బిజీ గా ఉంటున్నారు. ఆ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో ఒకరు ప్రసాద్. జబర్దస్త్ షో తర్వాత అతనికి పంచ్ ప్రసాద్ గా గుర్తింపు వచ్చింది. మొన్నటి వరకూ జబర్దస్త్ తో పాటు.. పండుగలకు ప్రసారమయ్యే స్పెషల్ ప్రోగ్రామ్ లలో, శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో కనిపించిన ప్రసాద్.. ఇప్పుడు మాయమయ్యాడు. అంతకుముందు నుండే ప్రసాద్ కు కిడ్నీల సమస్య ఉందని తెలిసిందే.

- Advertisement -

ఓ ఇంటర్వ్యూలో తనకు రెండు కిడ్నీలు పాడైనట్టు చెప్పుకొచ్చాడు పంచ్ ప్రసాద్. డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ.. తన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు సమాచారం. కదిలినా.. మెదిలినా విపరీతంగా పెయిన్ వస్తుండటం బాధాకరం. అనారోగ్యం కారణంగా అతను నడవలేని స్థితికి చేరుకున్నాడని.. ఆయన పరిస్థితి బాగోలేదని ‘జబర్దస్త్’ నూకరాజు చెప్పాడు. పంచ్ ప్రసాద్ కి అందరూ అండగా నిలబడాలని కోరాడు. ఆయనకు భార్య, పిల్లలు చేస్తున్న సేవలు చూసి తట్టుకోలేకపోయానన్నాడు. పంచ్ ప్రసాద్ అనారోగ్యం గురించి తెలిసిన వారంతా ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News