Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే (డిసెంబర్ 12) వస్తోందంటే ఫ్యాన్స్‌కి సర్ ప్రైజ్‌లు కంపల్సరీ. ఈ పుట్టిన రోజుకి తలైవార్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్టులు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ జైలర్ 2 నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఓ గ్లింప్స్‌ని తీసుకు వస్తున్నారట. ఈ మేరకు నెల్సన్, అనిరుధ్ ఇద్దరూ కూడా తెగ కష్టపడుతున్నారు. జైలర్ అనౌన్స్మెంట్ వీడియో, ఆనాడు వదిలిన గ్లింప్స్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. జైలర్ మీద ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన అలాంటి మరో వీడియోని వదలాలి అని మేకర్లు అనుకుంటున్నారట.
జైలర్ మూవీతో నెల్సన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. స్టైలీష్ మేకింగ్‌తో నెల్సన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అయితే సినిమాను ఆకాశంలో నిలబెట్టేసింది. రజినీకాంత్‌ను ఓల్డ్ లుక్‌లో చూపిస్తూనే ఆ స్వాగ్, స్టైల్‌ను అద్భుతంగా వాడుకున్నారు. అలా నడుచుకుంటూ వచ్చి ఆరు వందల కోట్లు కొల్లగొట్టేశాడంటూ రజినీ మేనియాకు అందరూ ఫిదా అయ్యారు. మాస్ ఆడియెన్స్‌లో జైలర్‌కు మంచి మార్కులు పడ్డాయి. పైగా జైలర్ చిత్రంలోని గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలు అద్భుతంగా సెట్ అయ్యాయి. దీనికి సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతోంది.
Also Read – Pushpa: బార్‌కి ‘పుష్ప’ బ్రాండ్ నేమ్.. స్థాయి తగ్గినట్టా? పెరిగినట్టా?
జైలర్ 2లోనూ అలాంటి స్పెషల్ మూమెంట్స్‌ను నెల్సన్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ ఫ్యాన్స్‌కి సర్ ప్రైజ్ ఇచ్చేలా బర్త్ డేకి మంచి అప్డేట్‌ను ప్లాన్ చేశాడు నెల్సన్. ఈ మూవీలో రజినీకాంత్ మరింత స్టైలీష్‌గా కనిపిస్తాడని, రమ్యకృష్ణతో ట్రాక్ మరింత అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ మూవీతో సన్ నెట్‌వర్క్స్‌కి మరో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు.
జైలర్ హిట్ అయిన తరువాత హీరోకి, డైరెక్టర్‌కి లగ్జరీ కార్లను నిర్మాత గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రజినీకి అయితే రెమ్యూనరేషన్‌తో పాటుగా షేర్ కూడా ఇచ్చాడని, ఇవన్నీ కాకుండా ఐదారు కోట్ల విలువైన లగ్జరీ కారుని కూడా నిర్మాత బహుమతిగా ఇచ్చాడని కోలీవుడ్ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ జైలర్ 2 సక్సెస్ తరువాత ఈ సారి ఏం గిఫ్ట్స్ ఇస్తాడో చూడాలి. ఈ సారి కూడా స్పెషల్ సాంగ్‌ని నెల్సన్ ప్లాన్ చేస్తున్నాడట. నువ్వు కావాలయ్యా.. అంటూ జైలర్‌తో తమన్నా చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఈ సారి రెండో పార్ట్‌లో అంతకు మించి అనేలా స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం.
Also Read – Ram Pothineni: ఎన్టీఆర్ నిర్మాతకు రామ్ కండీషన్స్

